Apple iOS 26 Update : వచ్చేవారమే ఆపిల్ iOS 26 అప్‌డేట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. సపోర్టు చేసే ఐఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple iOS 26 Update : ఆపిల్ లవర్స్ గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 15 నుంచి సపోర్టు చేసే అన్ని ఐఫోన్‌లకు iOS 26 అందుబాటులోకి రానుంది.

Apple iOS 26 Update : వచ్చేవారమే ఆపిల్ iOS 26 అప్‌డేట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. సపోర్టు చేసే ఐఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple iOS 26 Update

Updated On : September 10, 2025 / 3:38 PM IST

Apple iOS 26 Update : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌ సందర్భంగా అనేక కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్ చేసింది. ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఇతర కొత్త హార్డ్‌వేర్‌లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17 లైనప్ డిజైన్, డిస్ ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అప్ గ్రేడ్స్ అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఆపిల్ iOS 26 అప్‌డేట్ వచ్చే వారం రిలీజ్ చేయనుంది.

ఈ కొత్త అప్‌డేట్‌ను జూన్‌లో WWDC సమయంలో మొదటిసారి ప్రివ్యూ చేసింది. అప్పటి నుంచి బీటా టెస్టింగ్ (Apple iOS 26 Update) నిర్వహించింది. ఆపిల్ ఇప్పుడు అధికారిక లాంచ్ తేదీని సెప్టెంబర్ 15గా నిర్ణయించింది. ఆ తేదీన iOS 26 సపోర్టు ఉన్న అన్ని ఐఫోన్లలకు కొత్త అప్ డేట్ రిలీజ్ చేయనుంది.

Read Also : Apple Watch Series : వారెవ్వా.. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ చూశారా? ఏకంగా 3 మోడల్స్.. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలుసా?

ఆపిల్ iOS 26 సపోర్టు ఐఫోన్ డివైజ్‌లివే :

  • అన్ని ఐఫోన్ 17 మోడల్స్
  • ఐఫోన్ 16e
  • ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్
  • ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్
  • ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్
  • ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్
  • ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్
  • ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్
  • ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ
  • ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్
  • ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ
  • ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్
  • ఐఫోన్ 11
  • ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్
  • ఐఫోన్ SE (2వ జనరేషన్, ఆపై వెర్షన్ )

iOS 26 ముఖ్య ఫీచర్లు :
iOS 26 అపారదర్శక లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ కలిగి ఉంటుంది. డివైజ్ స్మార్ట్ సమ్మరీస్, జెన్మోజీకి అప్ డేట్స్, లైవ్ ట్రాన్స్‌లేషన్, సందర్భోచిత విజువల్ యాక్షన్స్ కూడా అందిస్తుంది. ఐఓఎస్ 26 కాల్, మెసేజ్ స్క్రీనింగ్, లైవ్ యాక్టివిటీస్, కార్‌ప్లే అల్ట్రాతో కార్‌ప్లేకి అప్‌గ్రేడ్ కూడా ఉన్నాయి. ఆపిల్ వాలెట్, మ్యూజిక్, మ్యాప్స్, ఆపిల్ పే వంటి లోకల్ యాప్స్ కూడా అప్ గ్రేడ్ పొందుతాయి. మరో హైలైట్ కొత్త గేమ్‌ యాప్, గేమింగ్ కంటెంట్‌ను ఒకే చోట యాక్సస్ చేయొచ్చు.