Bixby One UI 8.5 : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. మీ ఫోన్లో ఇక సెట్టింగ్స్ పేర్లు గుర్తుపెట్టుకోనక్కర్లేదు.. బిక్స్బీ AIతో మాట్లాడితే చాలు!
Bixby One UI 8.5 : బిక్స్బీ ఏఐ ఫీచర్ పర్ప్లెక్సిటీ సాయంతో వెబ్ నుంచి మీకు కావాల్సిన సమాచారాన్ని రియల్ టైంలో అందిస్తుంది. ఇదేలా పనిచేస్తుందంటే?
Bixby One UI
- శాంసంగ్ ‘బిక్స్బీ’కొత్త ఏఐ ఏజెంట్ ఫీచర్ వచ్చేసింది
- వన్ UI 8.5 బీటా శాంసంగ్ ఫోన్లకు ‘బిక్స్బీ’సపోర్టు
- వన్ యూఐ 8.5తో రియల్ టైమ్ సమాచారం
Bixby One UI 8.5 : శాంసంగ్ యూజర్లకు పండగే.. శాంసంగ్ ‘బిక్స్బీ’కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఏఐ ఏజెంట్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు వన్ UI 8.5 బీటా రన్ అయ్యే శాంసంగ్ ఫోన్లలో అందుబాటులో ఉంది.
శాంసంగ్ ఏఐ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు గతంలో కన్నా మరింత పవర్ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్‌ను కొన్ని వారాల క్రితమే సౌత్ కొరియన్ దిగ్గజం అప్డేట్ చేసింది. ఈ బిక్స్బీ పర్ప్లెక్సిటీతో ఇంటిగ్రేట్ అయింది.
ఏఐతో రియల్ టైం సమాచారం :
మీరు బిక్స్బీని ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. పర్ప్లెక్సిటీ సాయంతో వెబ్ నుంచి మీకు కావాల్సిన సమాచారాన్ని రియల్ టైంలో అందిస్తుంది. దీనికి ప్రత్యేక యాప్ లేదా వెబ్ బ్రౌజర్ అవసరం లేదు. బిక్స్బీ లోకల్ ఇంటర్ఫేస్లోనే నేరుగా మీకు కావాల్సిన లేటెస్ట్ డేటాను యాక్సస్ చేయొచ్చు.
ఉదాహరణకు.. మీరు బిక్స్బీని ఏదైనా ఒక ప్రశ్న అడిగి చూడండి.. “హైదరాబాద్‌లో పిల్లల కోసం మంచి ప్లే గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయి” అని అడిగితే అది పెర్ప్లెక్సిటీని ఉపయోగించి డేటాను తిరిగి చూపిస్తుంది. ఇంటర్ఫేస్లో సంబంధిత సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఈ యూజర్ ఇంటర్ఫేస్ బిక్స్బీతో రీడిజైన్ చేసింది. మీ పాత చాటింగ్ మరింత ఈజీగా రివ్యూ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని మాదిరిగానే స్క్రీన్ లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూలోని అన్ని చాట్ థ్రెడ్లను డిస్ప్లే చేస్తుంది. అవసరమైతే పాత చాట్ హిస్టరీని కూడా చూడొచ్చు.
లాంగ్వీజీ కమాండ్స్‌తో కంట్రోల్ :
బిక్స్బీ లేటెస్ట్ లాంగ్వేజీ కమాండ్స్ ఉపయోగించి గెలాక్సీ స్మార్ట్ఫోన్లను కూడా కంట్రోల్ చేయగలదు. నావిగేట్ చేయగలదు. మీ శాంసంగ్ ఫోన్ ఫీచర్ లేదా సెట్టింగ్ కచ్చితమైన పేరు మీరు తెలుసుకోవాల్సిన పనిలేదు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు అడగొచ్చు. బిక్స్బీ మీ కమాండ్స్ అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా మీకు డేటాను అందిస్తుంది.
ఉదాహరణకు.. మీరు “నేను స్క్రీన్ చూసే సమయంలో టైమ్ ఔట్ కాకూడదు” అని అడిగితే వెంటనే బిక్స్బీ గెలాక్సీ S25లో ‘చూస్తున్నపుడు స్క్రీన్ ఆన్‌లో ఉంచండి’ అనే సెట్టింగ్ ఆటోమాటిక్ గా ఎనేబుల్ చేస్తుంది.
భారత్ సహా ఈ దేశాల్లో అందుబాటులో :
బిక్స్బ కొత్త వెర్షన్ ప్రస్తుతం జర్మనీ, భారత్, కొరియా, పోలాండ్, యూకే, యుఎస్‌లోని వన్ యుఐ 8.5 బీటా ప్రోగ్రామ్ పాల్గొనేవారికి అందుబాటులో ఉంది. స్టేబుల్ వన్ యుఐ 8.5 అప్డేట్లో భాగంగా రాబోయే నెలల్లో అన్ని మార్కెట్లలోకి రానుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు, టాబ్లెట్లకు కూడా ఈ వన్ యూఐ 8.5 అప్డేట్ అందుబాటులోకి వస్తుంది.
