Hero Glamour Launch : కొంటే ఇలాంటి బైక్ కొనాలి.. కొత్త హీరో గ్లామర్ బైక్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

Hero Glamour Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త హీరో గ్లామర్ బైక్ వచ్చేసింది. ధర ఎంతో తెలుసా?

New Hero Glamour launched, check price, features, other details here

Hero Glamour Launch : ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కొత్త హీరో గ్లామర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త గ్లామర్ బైక్ రూ. 82,348 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ మోటార్‌సైకిల్ లేటెస్ట్ అవతార్ ఇప్పుడు కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కొత్త గ్లామర్‌ బైక్ 125cc ఇంజన్ ఉంది. గరిష్టంగా 10.8PS పవర్, 10.6Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : 2023 Royal Enfield Bullet 350 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. సెప్టెంబర్‌లోనే లాంచ్..!

హీరో MotoCorp i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీతో ఈ మోటార్‌సైకిల్ 63kmpl మైలేజీని అందిస్తుంది. కొత్త హీరో గ్లామర్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. చెకర్డ్ స్ట్రిప్స్ మోటార్ సైకిల్ మొత్తం స్పోర్టీ లుక్‌ను మెరుగుపరుస్తాయి. రైడర్, పిలియన్ సీటు ఎత్తు వరుసగా 8 మి.మీ, 17 మి.మీ తగ్గిస్తుంది. మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ అనే 2 వేరియంట్‌లలో వస్తుంది. ఈ 2 వేరియంట్‌ల వారీగా హీరో గ్లామర్ ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కింద ఉన్నాయి.

Hero Glamour Launch, check price, features, other details here

హీరో గ్లామర్ బైక్ స్పెషిఫికేషన్లు : 

హీరో గ్లామర్ డ్రమ్ బ్రేక్ ధర రూ. 82,348, హీరో గ్లామర్ డిస్క్ బ్రేక్ ధర రూ. 86,348 నుంచి ఉంటుంది. హీరో కొత్త గ్లామర్‌ను క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. కొత్త హీరో గ్లామర్ హోండా షైన్ 125, TVS రైడర్, బజాజ్ పల్సర్ 125 వంటి వాటికి పోటీగా వస్తుంది.

హీరో గ్లామర్ బైక్ లాంచ్‌పై హీరో మోటోకార్ప్‌లోని ఇండియా BU చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘హీరో గ్లామర్ యువతలో స్టైల్, సౌలభ్యం, సౌకర్యాలను కోరుకునే అభిమానులను సృష్టించింది. హీరో మోటోకార్ప్ ఎల్లప్పుడూ కస్టమర్‌లకు విలక్షణమైన ఫీచర్లు, టెక్నాలజీతో అధునాతన ప్రొడక్టులను అందించడమే లక్ష్యం.

కొత్త గ్లామర్ ద్వారా అత్యంత పోటీతత్వంతో 125cc విభాగంలో బ్రాండ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది. మార్కెట్ వాటాను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఐకానిక్ గ్లామర్ కొత్త అవతార్‌లో ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు.

Read Also : TVS X Crossover Scooter : కొత్త టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో.. సింగిల్ ఛార్జ్‌తో 105కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

ట్రెండింగ్ వార్తలు