Instagram Plus Subscription : ఇన్‌స్టాలో కొత్త ప్లస్ సబ్స్క్రిప్షన్.. ఇక స్టోరీలు సీక్రెట్‌గా చూడొచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!
Instagram Plus Subscription : ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ప్లస్ అనే కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. స్టోరీ స్పాట్లైట్, స్టోరీ రీవాచ్ ఇన్సైట్స్, స్టోరీ ప్రివ్యూ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది.
Instagram Plus Subscription
- ఇన్స్టాగ్రామ్ ప్లస్‌కు స్టోరీ స్పాట్లైట్ స్టోరీ ఎక్స్టెండ్ ఫీచర్లు
- ఒక స్టోరీని ఎన్ని సార్లు చూశారో యూజర్లు చూడొచ్చు
- ఇన్స్టాగ్రామ్ నార్మల్ ఫ్రీ వెర్షన్ ఎప్పటిలాగే వాడొచ్చు
Instagram Plus Subscription : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే అప్డేట్.. ‘ఇన్స్టాగ్రామ్ ప్లస్’ అనే కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసింది. పర్సనలైజేషన్, అడ్వాన్స్ అదనపు షేరింగ్ కంట్రోలింగ్ కోరుకునే యూజర్ల కోసం ఆప్షనల్ పేమెంట్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుత ఇన్ స్టా యూజర్లు ఎప్పటిలాగే సబ్స్క్రిప్షన్ లేకుండానే యాప్‌ను ఉచితంగా (Instagram Plus Subscription) వాడుకోవచ్చు. కానీ, ప్లస్ యూజర్ల కోసం ఈ కొత్త ప్లాన్‌లో స్టోరీ షేరింగ్, ఆడియన్స్ కంట్రోల్, ప్రొఫైల్ కస్టమైజేషన్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇన్‌స్టాలో 3 మెయిన్ కేటగిరీలు :
ఇన్స్టాగ్రామ్ ప్లస్‌ను 3 మెయిన్ కేటగిరీలుగా విభజించినట్లు ఇన్స్టాగ్రామ్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సోషల్ కనెక్టివిటీ, ఇన్సైట్స్ ప్రివ్యూ టూల్స్, ప్రొఫైల్ కస్టమైజేషన్ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త సబ్‌స్క్రిప్షన్‌తో ‘స్టోరీ స్పాట్లైట్’ ఫీచర్ అందిస్తోంది. ఇన్‌స్టా స్టోరీని యూజర్ల స్నేహితుల స్టోరీ ఫీడ్‌లో చూపించవచ్చు. అంతేకాదు.. ‘మల్టిపుల్ స్టోరీ ఆడియన్సెస్’ ఫీచర్ కూడా ఉంది.
యూజర్లు వేర్వేరు వ్యక్తుల కోసం మల్టీ కస్టమ్ ఆడియన్స్ లిస్టును క్రియేట్ చేయొచ్చు. ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చెప్పొచ్చు. అయితే, ‘స్టోరీ ఎక్స్టెండ్’ ఫీచర్ ద్వారా స్టోరీ వ్యవధిని 24 గంటల నుంచి 48 గంటలకు పెంచుకోవచ్చు.
ఇన్స్టాగ్రామ్ ప్లస్‌లో సూపర్ హార్ట్స్ ఫీచర్ కూడా ఉంది. మీ స్నేహితుని స్టోరీకి రియాక్ట్ అయితే యానిమేటెడ్ హార్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. స్టోరీ ఇంటరాక్షన్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
కంటెంట్ యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ప్లస్‌లో సరికొత్త ఇన్సైట్స్ టూల్స్ ఉన్నాయి. ఇందులో ‘స్టోరీ రీవాచ్ ఇన్సైట్స్’ కూడా ఒకటి. ఒక స్టోరీని ఎన్నిసార్లు చూశారో తెలుసుకోవచ్చు. ‘సెర్చ్ వ్యూయర్ లిస్ట్’ ఫీచర్, స్టోరీ వ్యూయర్ లిస్ట్‌లో నిర్దిష్ట అకౌంట్‌ను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.
కంపెనీ ‘స్టోరీ ప్రివ్యూ’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. తద్వారా సబ్స్క్రైబర్లు స్టోరీ ఓపెన్ చేయకుండానే ప్రివ్యూ చూడవచ్చు. అయితే, దీనికి సంబంధించి అన్ని ఫీచర్ల పూర్తి వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
