Apple MacBook Air M3 : కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M3 మోడల్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ పొందాలంటే?

Apple MacBook Air M3 : ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M3 మోడల్ 8జీబీ ర్యామ్+ 256జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ కోసం రూ. 1,03,490 ప్రారంభ ధరతో జాబితా అయింది.

New MacBook Air M3 model available with massive discount ( Image Source : Google )

Apple MacBook Air M3 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ నుంచి సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 5 నెలల క్రితం లాంచ్ అయిన ఈ కొత్త ల్యాప్‌టాప్ ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్‌తో ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అమెజాన్, విజయ్ సేల్స్ రెండూ ఈ మాక్‌బుక్ ఎయిర్ మోడల్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఇందులో బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. కొత్త మ్యాక్‌బుక్ మోడల్‌పై ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌లను పొందడానికి ఇదే బెస్ట్ టైమ్. ఈ డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Moto G45 India Launch : మోటో జీ45 ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో కీలక ఫీచర్లు, ధర వివరాలు!

మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M3 మోడల్ 8జీబీ ర్యామ్+ 256జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ కోసం రూ. 1,03,490 ప్రారంభ ధరతో జాబితా అయింది. ఆపిల్ ఈ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో రూ. 1,14,900కి లాంచ్ చేసింది. వినియోగదారులు రూ.11,410 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌పై 10వేల అదనపు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు.

దీంతో మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 ధర రూ.93,490కి తగ్గుతుంది. లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 మోడల్‌పై విజయ్ సేల్స్ మొత్తం రూ.21,410 తగ్గింపు ఆఫర్‌ను ఇస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మిస్ చేయకూడని బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ ధర 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే మోడల్ స్పేస్ గ్రే కలర్‌తో ఉంటుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3పై అమెజాన్ డీల్ :
అమెజాన్ కూడా ఈ మ్యాక్‌బుక్‌ను తక్కువ ధరకు విక్రయిస్తోంది. మీరు ఏ కారణం చేతనైనా విజయ్ సేల్స్ ఆఫర్‌ను పొందలేకపోతే.. మీరు అమెజాన్ ఆఫర్‌ని చెక్ చేయవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3ని అదే మోడల్‌కు రూ. 1,04,900కి అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 24-నెలల డెబిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 5,250 అదనపు తగ్గింపు ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.99,650కి తగ్గుతుంది. విజయ్ సేల్స్ అమెజాన్ కన్నా మెరుగైన తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. అయితే, మీరు విజయ్ సేల్స్ ద్వారా మొదటి డీల్‌ను పొందలేకపోతే మాత్రమే ఈ డీల్‌ను ఎంచుకోవచ్చు.

Read Also : Air Hostess in India : భారత్‌లో ఎయిర్ హోస్టెస్ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఏయే అర్హతలు ఉండాలంటే?

ట్రెండింగ్ వార్తలు