Nothing True Wireless Earphones : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ నథింగ్ టెక్ బ్రాండ్ మరో ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. లండన్‌కు చెందిన టెక్ స్టార్టప్ అక్టోబర్ 26న నథింగ్ ఇయర్ స్టిక్ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. నథింగ్ బ్రాండ్ ద్వారా రెండవ ఆడియో ప్రొడక్టుగా చెప్పవచ్చు. మొదటి ఆడియో ప్రొడక్ట్ నథింగ్ ఇయర్ (1), కంపెనీ ప్రారంభించిన మొదటి ప్రొడక్టు కూడా. గత కొన్ని నెలలుగా ఇయర్ స్టిక్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటివరకూ దీనిపై అనేక లీక్‌లు, పుకార్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు కంపెనీ ప్రొడక్టును లాంచ్ వివరాలను కూడా ధృవీకరించింది.
అదనంగా, నథింగ్ ఇయర్ స్టిక్ డిజైన్‌ను కూడా నథింగ్ వెల్లడించింది. టీజర్ ఇయర్‌బడ్స్‌తో పాటు రాబోయే నథింగ్ ఇయర్ స్టిక్ ఛార్జింగ్ కేసును వెల్లడిస్తుంది. ఛార్జింగ్ కేస్, దాని నథింగ్ ఫోన్ (1) లాగానే కనిపిస్తుంది. నిజానికి, ఈ కేసు లిప్‌స్టిక్‌లా కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు చూసిన ఇతర ఇయర్‌బడ్స్ కేస్ లాగా లేదు. పొడవైన, ట్యూబ్ లాంటి డిజైన్ రూపాన్ని అందిస్తుంది.
ఇయర్‌బడ్‌లు 2021లో తిరిగి ప్రారంభమైన ఇయర్ (1) లాగా ఉన్నాయి. ఇయర్ స్టిక్ ఫీచర్ల గురించి ఏమీ వెల్లడించలేదు, కానీ ఇయర్ (1) లాగానే యాప్ సపోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ వంటి కొన్ని ప్రాథమిక ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నాం.ఇంకా ఈ డివైజ్ ధర ఎంతో తెలియరాలేదు. భారత మార్కెట్లో నథింగ్ ఇయర్ (1) ధర రూ.7,199గా ఉంది.
టెక్ కంపెనీ, కొద్ది నెలల క్రితమే భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ చేసింది. Flipkartలో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ కోసం రూ. 29,999 ప్రారంభ ధరతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 32,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 35,999గా అందుబాటులో ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..