Nothing Phone (1) : ప్రపంచవ్యాప్తంగా అనేక స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రమే యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. ఫీచర్ల నుంచి ధర ఇలా ప్రతిదీ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటాయి. ఇప్పుడు భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ (1) అనే ప్రత్యేకమైన డివైజ్ వస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు స్పెషల్ అని చెప్పాలి. జూలై 12న భారత్‌లో లాంచ్ అవుతోంది. ఈ కంపెనీ లండన్‌లో నథింగ్ ఫోన్ (1) లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను భారతీయ వినియోగదారులు వర్చువల్‌గా చూడొచ్చు.
కార్ల్ పీ-హెడ్ టెక్ బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్.. అందులోనూ నథింగ్ కంపెనీ నుంచి సెకండ్ ప్రొడక్టు కూడా. మొదటిది గతేడాదిలోనే రిలీజ్ అయింది. అధికారిక లాంచ్‌కు ముందు.. కంపెనీ నథింగ్ ఫోన్ (1) డిజైన్, LED లైట్లు, కెమెరా మాడ్యూల్, కొన్ని కీలక స్పెసిఫికేషన్లతో సహా చాలా కీలక వివరాలను వెల్లడించింది. ఇంటర్నెట్లో లాంచ్ కాకుండానే లీక్‌లు కామన్.. లాంచ్ చేయడానికి కొన్ని గంటల ముందు.. ఇప్పటివరకు నథింగ్ ఫోన్ (1) గురించి మనకు తెలిసిన విషయాలను ఓసారి పరిశీలిద్దాం..
నథింగ్ ఫోన్ (1) Launch Time :
Nothing Phone (1) ఈరోజు (జూలై 12) భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ 11AM ET / 8AM PT / 4PM BST (భారత కాలామానం ప్రకారం.. దాదాపు 8:30PM IST)కి లాంచ్ కానుంది.
Nothing Phone (1) Live Event Link :
నథింగ్ ఫోన్ (1) లాంచ్ ఈవెంట్ కంపెనీ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లలో లైవ్ అవుతుంది. YouTube Live ద్వారా కూడా లాంచ్ ఈవెంట్ వీక్షించవచ్చు.
Nothing Phone (1) స్పెసిఫికేషన్లు :
– నథింగ్ ఫోన్ (1) స్నాప్‌డ్రాగన్ 778+ SoC ప్రాసెసర్ ద్వారా అందించబడుతుంది. కనీసం 8GB RAM మరియు 128GB అంతర్గత నిల్వతో ఉండవచ్చు.
– ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో నథింగ్ OSలో రన్ అవుతుంది.
– స్మార్ట్‌ఫోన్ అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో వస్తోంది. ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్ డిజైన్, డివైజ్ చుట్టూ స్లిమ్ బెజెల్స్ ఉంటాయి.
– నథింగ్ ఫోన్ (1)లో 50-MP ప్రైమరీ లెన్స్, వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉందని కంపెనీ ధృవీకరించింది.
– ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఒకే కెమెరా ఉంటుంది.
– బాక్స్‌లో ఛార్జర్ ఉండదని లీక్స్ సూచిస్తున్నాయి.
– నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీతో వస్తుందని లీక్ డేటా సూచిస్తోంది.
– నథింగ్ ఫోన్ (1) వెనుక ప్యానెల్లో LED లైట్లను కలిగి ఉంటుంది. ఇది కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది.
– ఈ LED లైట్లు ఫోటో షాట్ల సమయంలో ఫిల్ లైట్‌గా పనిచేస్తాయి. -వైట్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.
– టిప్స్టర్లలో ఒకరు బ్లాక్ వెర్షన్‌ను కూడా లీక్ చేశారు. అయితే కంపెనీ ఇంకా ఆ వెర్షన్ ఏంటో ధృవీకరించలేదు.
భారత్‌లో Nothing Phone (1) ధర (అంచనా) :
నథింగ్ ఫోన్ (1) అధికారిక ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే, లీక్‌ల ప్రకారం.. భారతదేశంలో నథింగ్ ఫోన్ (1) ధర దాదాపు రూ. 30,000 వరకు ఉంటుందని అంచనా. అదే జరిగితే, ఈ ఫోన్ OnePlus Nord 2T, iQOO Neo 6, ఇతర వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. అసలు ధర ఎంత ఉంటుంది అనేది లాంచ్ ఈవెంట్లో వెల్లడి కానుంది.
Nothing Phone (1) సేల్ :
Nothing Phone (1) సేల్ డేట్ ఇంకా వెల్లడి కాలేదు. కానీ లాంచ్ అయిన తర్వాత, నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Read Also : Nothing Phone (1) : మూడు వేరియంట్లలో అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. జూన్ 12 నుంచే సేల్.. డోంట్ మిస్!