Nothing Phone 3 : ఇది కదా ఆఫర్.. అమెజాన్‌లో రూ. 80వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ. 45వేలకే.. కొనాలా? వద్దా?

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ. 45వేల కన్నా తక్కువకే కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Nothing Phone 3 ( Image Credit AI )

  • అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 రూ. 45వేల లోపు ధరకే లభిస్తోంది
  • బ్యాంకు ఆఫర్లు, ఈఎంఐ ప్లాన్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు
  • 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్, మూడు 50MP కెమెరాలు

Nothing Phone 3 : నథింగ్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. నథింగ్ ఫోన్ 3 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రీమియం స్పెసిఫికేషన్లతో అత్యంత ఆకర్షణీయమైన ఈ ఫోన్ అసలు ధర రూ. 79,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది.

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్ మరింత తగ్గించుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ లెవల్ (Nothing Phone 3) పర్ఫార్మెన్స్, అమోల్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నథింగ్ ఫోన్ 3 అమెజాన్ డీల్ :
నథింగ్ ఫోన్ 3 మోడల్ రూ. 35,001 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం రూ. 44,998 ధరకు లభ్యమవుతోంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అసలు ధరపై మరో రూ. 2,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ నెలకు కేవలం రూ. 1,582 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘం గుడ్‌న్యూస్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట! 5 కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్!

మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉండి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద రూ. 40,600 వరకు తగ్గింపు పొందవచ్చు. ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ ప్రస్తుత ఫోన్ బ్రాండ్, వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ HDR10+తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌తో పాటు 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో 5,500mAh బ్యాటరీ ఉంది. 65W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 3లో 50MPతో 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో, అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

నథింగ్ ఫోన్ 3 కొనాలా? వద్దా? :
అద్భుతమైన పర్ఫార్మెన్స్, ప్రత్యేకమైన డిజైన్, మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే నథింగ్ ఫోన్ 3 అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుత డిస్కౌంట్‌తో ఈ ఫోన్ ధర రూ. 45వేల కన్నా తక్కువకే లభిస్తోంది.