OnePlus 13 : కొంటే వన్‌ప్లస్ కొనాలి.. ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ చాలా చీప్ గురూ.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో వన్‌ప్లస్ 13 తక్కువ ధరకే లభ్యమవుతోంది. ఈ ఫోన్‌లో భారీ అమోల్డ్ డిస్‌ప్లే, అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

OnePlus 13

  • అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ఫోన్ అతి చౌకైన ధరకే
  • 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, 12GB ర్యామ్ ఆప్షన్లు
  • బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్లు
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP సెన్సార్

OnePlus 13 : వన్‌ప్లస్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్. వన్‌ప్లస్ 13 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఆకర్షణీయమైన ఫోన్లలో కంపెనీ సిరీస్ వన్‌ప్లస్ ఒకటి. ఈ డివైస్ పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో భారీ కెమెరా సెటప్‌ అందిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్ చేస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, 12GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 69,999 ఇప్పుడు కేవలం రూ. 60,999కే అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1800 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 60,000 లోపే వస్తుంది. బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : WhatsApp Schedule Calls : భలే ఉందిగా ఫీచర్.. వాట్సాప్‌లో మీ కాల్స్‌ ఇలా ఈజీగా షెడ్యూల్ చేయొచ్చు.. సింపుల్ గైడ్ మీకోసం

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ప్యానెల్ సెరామిక్ గార్డ్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. వన్‌ప్లస్ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32MP సెన్సార్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.