×
Ad

OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ 13పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

OnePlus 13 Price : వన్‌ప్లస్ 15 వచ్చే నెలలోనే లాంచ్ కానుంది. అమెజాన్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6
OnePlus 13 Price : అమెజాన్ దీపావళి సేల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభ్యమవుతున్నాయి. మీరు వన్‌ప్లస్ అభిమాని అయితే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 13 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.
2/6
వచ్చే నెలలో వన్‌ప్లస్ 15 లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
3/6
వన్‌ప్లస్ 13 అమెజాన్ డీల్ : వన్‌ప్లస్ 13 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమెజాన్ నుంచి దీపావళి సేల్‌లో అసలు లాంచ్ ధర రూ.72,999కు బదులుగా రూ.61,999కు కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లందరూ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ.60,500కు తగ్గుతుంది.
4/6
అంతేకాకుండా, ఎంపిక చేసిన బ్యాంకులకు ఈ వన్‌ప్లస్ ఫోన్ నో-కాస్ట్ ఈఎంఐ డీల్స్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ ఓషన్, ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
5/6
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, అడ్రినో 830 జీపీయూతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ శాంసంగ్ ఫోన్ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
6/6
వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ స్నాపర్‌ను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ 6000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.