OnePlus 13 Price : ఆఫర్ అదిరింది బ్రో.. వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

OnePlus 13 : వన్‌ప్లస్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ 13 తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ రూ. 13వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6
OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. మీరు వన్ ప్లస్ అభిమాని అయితే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం వన్‌ప్లస్ 13 భారీ తగ్గింపుతో లభిస్తోంది. పాత జనరేషన్ ఫోన్ అయినా ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
2/6
అమెజాన్ ఇండియాలో వన్‌ప్లస్ 13 భారీ డిస్కౌంటుతో లభిస్తోంది. ఈ ఫోన్ తగ్గింపు ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
3/6
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు : వన్‌ప్లస్ 13 ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.76,999 ఉండగా అమెజాన్ ద్వారా రూ.67,999 ధరకు లభిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్లతో రూ.3000 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ.64,999కి తగ్గుతుంది. ఈ ఫోన్ బ్లాక్ ఎక్లిప్స్, ఆర్కిటిక్ డాన్, మిడ్‌నైట్ ఓషన్ 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, అడ్రినో 830 జీపీయూ ఉన్నాయి. 6.82-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
5/6
వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
6/6
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని అందిస్తుంది.