×
Ad

OnePlus 13 : ఆఫర్ అదిరింది భయ్యా.. వన్‌ప్లస్ 13పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..!

OnePlus 13 : వన్‌ప్లస్ 13 ధర తగ్గింది. విజయ్ సేల్స్‌లో రూ. 9వేలు ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంకు ఆఫర్లతో రూ. 3,500 డిస్కౌంట్ అందిస్తోంది. మొత్తంగా రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు..

  • Published On : February 14, 2026 / 04:37 PM IST

OnePlus 13

  • భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ప్రారంభ ధర రూ. 69,999
  • ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.60,999కి లిస్టింగ్
  • విజయ్ సేల్స్‌లో రూ.9వేలు ఫ్లాట్ ధర డిస్కౌంట్
  • బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ. 3,500 డిస్కౌంట్

OnePlus 13 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. విజయ్ సేల్స్‌లో ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 12వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది.

సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫోన్ కోరుకునే వారికి అద్భుతమైన డిస్కౌంట్ అని చెప్పొచ్చు. వాస్తవానికి, ఇలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ లిమిటెడ్ డీల్ ముగిసేలోగా వెంటనే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ, వన్‌ప్లస్ 13 ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 13 డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ప్రారంభ ధర రూ. 69,999తో లాంచ్ అయింది. అయితే, విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 60,999కు లిస్ట్ అయింది. అంటే రూ. 9వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొంటే అదనంగా రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.  దాంతో మొత్తంగా ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 57,499కు తగ్గింది.

Read Also :  Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే కోసం రూ. 20వేల లోపు టాప్ 6 స్మార్ట్‌ఫోన్లు.. మీకు ఇష్టమైనవారికి ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారంటే?

వన్‌ప్లస్ 13 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ HDR10+కి కూడా సపోర్టు ఇస్తుంది. 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్‌కామ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, అడ్రినో 830 జీపీయూతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తుంది. ఇంకా, వన్‌ప్లస్ 13 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్ వరకు, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.