OnePlus 16 Leak : గెట్ రెడీ.. 9000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ 16 వచ్చేస్తోంది.. కీలక కెమెరా ఫీచర్లు లీక్..!
OnePlus 16 Leak : రాబోయే వన్‌ప్లస్ 16లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 9,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. పూర్తి ఫీచర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- June 17, 2026 / 04:10 PM IST
OnePlus 16 Leak
- వన్‌ప్లస్ 16లో 6.78-అంగుళాల 1.5K BOE డిస్‌ప్లే
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP శాంసంగ్ HP5 పెరిస్కోప్ కెమెరా
- సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ సెటప్
OnePlus 16 Leak : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ 16 ఫోన్ అతి త్వరలో రాబోతుంది. లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 16 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. కానీ, ఈ ఫోన్ మోడల్ అధికారిక ఫీచర్లను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. లీకుల ప్రకారం.. వన్‌ప్లస్ 16 పేరుతో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో (OnePlus 16 Leak) కంపెనీ టెస్టింగ్ చేస్తోంది. డిస్‌ప్లే 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 16లో 6.78-అంగుళాల 1.5K బీఓఈ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ డిస్‌ప్లేలో బ్రైట్‌నెస్, కలర్ రిప్రొడక్షన్ పవర్ ఎఫిషియెన్సీలో అప్‌గ్రేడ్ రావొచ్చు. బెజెల్స్ 4 వైపులా 1mm కన్నా తక్కువగా ఉండొచ్చు.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ 16 రియర్ కెమెరా యూనిట్‌లో 200MP కెమెరా ఉండవచ్చు. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మల్టీస్పెక్ట్రల్ కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP శాంసంగ్ HP5 పెరిస్కోప్ కెమెరా ఉండవచ్చు.
Read Also : Google Pixel 9a : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఈ గూగుల్ పిక్సెల్ 9aపై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు..
3.5x ఆప్టికల్ జూమ్ 80mm ఫోకల్ లెంగ్త్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,000mAh బ్యాటరీ ఉండొచ్చు. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండవచ్చు. అయితే, కంపెనీ ఈ వివరాలను ఇంకా వెరిఫై చేయలేదు.
గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల FHD+ (1,272×2,772 పిక్సెల్స్), 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 840 జీపీయూతో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS16పై రన్ అవుతుంది. 7,300mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
