OnePlus 16 Launch : వారెవ్వా..! మతిపోగొట్టే ఫీచర్లతో వస్తోన్న వన్‌ప్లస్ 16.. లాంచ్‌కు ముందే లీక్స్ వైరల్!

OnePlus 16 Launch : 2025 నవంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై భారీ అంచనాలివే..

OnePlus 16 Launch

  • వన్‌ప్లస్ 16లో 4 ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు ఉండొచ్చు
  • రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని కొత్త ఫీచర్లు అందించే ఛాన్స్
  • గత ఏడాదిలో వచ్చిన వన్‌ప్లస్ 15కు ఇది అప్‍గ్రేడ్ వెర్షన్

OnePlus 16 Launch : వన్‌ప్లస్ నుంచి అద్భుతమైన ఫోన్ రాబోతుంది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ 16లో కొన్ని కొత్త ఫీచర్లు ఉంటాయని కంపెనీ సూచించింది.

ఇటీవల జరిగిన స్నాప్‌డ్రాగన్ గేమింగ్ టెక్నాలజీ అవార్డ్స్‌లో చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారైంది. వన్‌ప్లస్ 16లో మొత్తం 4 ర్యామ్, స్టోరేజ్ (OnePlus 16 Launch) ఆప్షన్లు ఉండవచ్చు. గత ఏడాదిలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15 ప్లేసులో వస్తుందని అంచనా. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

నివేదికల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB ర్యామ్ వేరియంట్ ఉండొచ్చు. వన్‌ప్లస్ 11 తర్వాత ఈ వేరియంట్ మళ్లీ రాలేదు. వన్‌ప్లస్ 16 ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు ధర CNY 4,999 (సుమారుగా రూ. 70,600), 12GB + 256GB వేరియంట్‌కు CNY 5,499 (సుమారుగా రూ. 77,600), 12GB + 512GB వేరియంట్‌కు CNY 5,999 (సుమారుగా రూ. 84,700)గా ఉండవచ్చని అంచనా.

వన్‌ప్లస్ 16 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ( అంచనా) :

వన్‌ప్లస్ 16 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో కూడా అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర CNY 7,499 (దాదాపు రూ. 1,05,900) గా ఉండవచ్చు. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ టెక్నాలజీ కూడా ఉంటుందని వన్‌ప్లస్ కంపెనీ పేర్కొంది.

Read Also : Oppo F35 Series : ఒప్పో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త ఒప్పో F35 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లపై భారీ అంచనాలివే..!

గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల FHD+ (1,272×2,772 పిక్సెల్స్) 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 840 జీపీయూతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని గేమింగ్-సంబంధిత ఫీచర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 15లో కొత్త ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కొన్ని గేమ్‌లకు 165fps వరకు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. అంతేకాదు.. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.

వన్‌ప్లస్ 15లోని 7,300mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుంది.