OnePlus Ace 7 : కెమెరా కేక, 10,000mAh బ్యాటరీ మాస్! కొత్త వన్‌ప్లస్ ఫోన్ మార్కెట్‌ని షేక్ చేయబోతోంది!
OnePlus Ace 7 : వన్‌ప్లస్ ఏస్ 7 త్వరలో వన్‌ప్లస్ 16తో పాటు లాంచ్ కానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక డేటాను రివీల్ చేయలేదు.
- Sreehari A
- Published on- June 6, 2026 / 08:08 PM IST
OnePlus Ace 7
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 చిప్‌సెట్
- వన్‌ప్లస్ ఏస్ 7లో 1.5K ఫ్లాట్ ప్యానెల్ సెటప్
- గేమింగ్ కోసం అదనపు ఫీచర్లు ఉండే ఛాన్స్
OnePlus Ace 7 : గేమర్ల కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ నుంచి అతి త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. లీక్‌లను పరిశీలిస్తే.. వన్‌ప్లస్ ఏస్ 7 ఫోన్ స్పెసిఫికేషన్లను రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 185Hz అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ ఏస్ 7లో కొన్ని గేమింగ్ ఫీచర్లు కూడా ఉండొచ్చు.
రాబోయే ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 చిప్‌సెట్‌తో హై పర్ఫార్మెన్స్ వన్‌ప్లస్ డివైజ్ టెస్టింగ్ చేస్తున్నట్టు డిజిటల్ చాట్ స్టేషన్ రిపోర్టు చేసింది. కొత్త వన్‌ప్లస్ ఏస్ 7 పేరుతో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. అయితే, ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 9,000mAh బ్యాటరీ ఉంటుందని వార్తలు వచ్చాయి.
వన్‌ప్లస్ ఏస్ 7 ఫోన్ 185Hz అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్‌తో 1.5K ఫ్లాట్ ప్యానెల్‌తో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో రానుంది. వన్‌ప్లస్ ఏస్ 7 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉంటాయని అంచనా.
వన్‌ప్లస్ ఏస్ 7 కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ 16తో పాటు చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్, ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు.
వన్‌ప్లస్ ఏస్6 అల్ట్రా ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్ HD+(1,272×2,772 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్ ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్, 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఏఆర్ఎమ్ మాలి-జీపీయూతో వర్క్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16పై రన్ అవుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.8 అపర్చర్, ఆటోఫోకస్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా సెటప్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేందుకు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ ఏస్6 అల్ట్రా ఫోన్ 8,600mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
