OnePlus Ace 7 Series : గెట్ రెడీ.. 9,000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ Ace 7 సిరీస్‌ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్!

OnePlus Ace 7 Series : రాబోయే సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లతో రన్ అవుతాయని అంచనా.

OnePlus Ace 7 Series

  • స్టాండర్డ్ మోడల్‌, వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో కూడా ఉండొచ్చు
  • స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ సెటప్, 9,000 mAh బ్యాటరీ
  • వన్‌ప్లస్ ఏస్ 7, వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో ఫోన్లు లాంచ్

OnePlus Ace 7 Series : వన్‌ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన ఫోన్లు వచ్చేస్తున్నాయి.. అతి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్ లాంచ్ కు ముందే కొన్ని లీక్‌లు పూర్తి వివరాలు రివీల్ అయ్యాయి. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో కూడా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో (OnePlus Ace 7 Series) స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఉంటాయని భావిస్తున్నారు. వన్‌ప్లస్ ఏస్ 6 సిరీస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ ప్రవేశపెట్టింది.

అయితే, రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌లు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌లలో ఒకటి.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో రాగా మరొకటి అదే చిప్‌సెట్ కస్టమ్ వెర్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 1.5K రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది.

Read Also : Diesel isobutanol : E20 అయిపోయింది.. ఇప్పుడు మళ్లీ ఇంకోటి వచ్చింది.. ఇప్పుడు డీజిల్లో కలుపుతారట.. అదేంటంటే..!

వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్ ఫీచర్లు ( అంచనా) :
వన్‌ప్లస్ ఏస్ 7, వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో ఫోన్‌లు 100W, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 9,000mAh బ్యాటరీ వస్తాయిని అంచనా. థర్మల్ మేనేజ్‌మెంట్ పరంగా ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉండవచ్చు. ఈ సిరీస్‌లోని ప్రో మోడల్‌లో 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గురించి ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

గత ఏడాదిలో వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 6, 165Hz రిఫ్రెష్ రేట్ 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.83-అంగుళాల 1.5K (1272×2800 పిక్సెల్స్) అమోల్డ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జీ2 గేమింగ్ చిప్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ఉంది. వన్‌ప్లస్ ఏస్ 6 ఫోన్ 7,800mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే 3డీ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

వన్‌ప్లస్ Ace6 అల్ట్రా ఇటీవల లాంచ్ అయింది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీపీయూ ద్వారా పవర్ పొందుతుంది.