OnePlus Community Sale 2026 : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు..
OnePlus Community Sale 2026 : భారత మార్కెట్లో వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026 సందర్భంగా వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 13, నార్డ్ సిరీస్, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్టులపై బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఇతర ఆఫర్లు ఉన్నాయి.
- Sreehari A
- Published on- June 6, 2026 / 04:58 PM IST
OnePlus Community Sale 2026
- వన్‌ప్లస్ 13 ధర రూ. 52,999కి తగ్గింది
- వన్‌ప్లస్ 15 నార్డ్ సిరీస్‌లపై మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్లు
- టాబ్లెట్లు, ఫ్రీ స్టైలస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు
- జూన్ 10వ తేదీ వరకు వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్
OnePlus Community Sale 2026 : వన్‌ప్లస్ అభిమానులకు పండగే.. వన్‌ప్లస్ ఇండియా కమ్యూనిటీ సేల్ 2026 ప్రకటించింది. ఈ సేల్ సమయంలో అనేక వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే, వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13s వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు నార్డ్ సిరీస్ మోడల్స్ ఉన్నాయి.
కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు నో-కాస్ట్ ఈఎంఐ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. కొన్ని టాబ్లెట్‌లతో పాటు ఫ్రీ స్టైలస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెళ్లలో లిమిటెడ్ టైమ్ ఉంటాయి.
వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ సేల్ 2026 వివరాలను కంపెనీ షేర్ చేసింది. దీని ప్రకారం.. ఈ ఆఫర్లు కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బ్లింకిట్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో లభ్యమవుతాయి.
ఈ నెల 10 వరకు కమ్యూనిటీ సేల్ ఆఫర్లు :
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని బండిల్ ఆఫర్లు, ప్రమోషనల్ బెనిఫిట్స్ జూన్ 7వ తేదీ వరకు మాత్రమే లభిస్తాయి.
Read Also : Home Loan Rates : పండగ చేస్కోండి! ఈ జూన్‌లో తక్కువ వడ్డీకే హోం లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
వన్‌ప్లస్ 15పై రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 74,999కి తగ్గింది. వన్‌ప్లస్ 15Rపై కూడా బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. దాంతో ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 51,999కి తగ్గింది.
కంపెనీ పాత ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13పై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నేరుగా రూ. 12వేలు ధర తగ్గింపు, రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 52,999కి తగ్గింది.
మరోవైపు, వన్‌ప్లస్ 13sపై కూడా రూ.2వేలు తగ్గింపు, రూ. 3వేలు బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. ఫలితంగా ఈ ఫోన్ ధర రూ. 49,999కి లభిస్తోంది.
మిడ్ రేంజ్ విషయానికి వస్తే.. :
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లోని నార్డ్ 6ను రూ. 40,999కే కొనేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE6 ఫోన్ రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. తద్వారా ధర రూ. 29,999కి తగ్గింది. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ కూడా రూ. 1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దాంతో ఈ డివైజ్ ధర రూ. 21,499కి తగ్గింది.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంపెనీ టాబ్లెట్‌లపై కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ 4 పై రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. తద్వారా ధర రూ. 56,999కి చేరింది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 డివైజ్ ధర రూ. 26,999కి, ప్యాడ్ లైట్‌ను రూ. 16,999కి కొనేసుకోవచ్చు. లిమిటెడ్ టైమ్, కంపెనీ ప్యాడ్ 4తో పాటు స్టైలో ప్రో, ప్యాడ్ గో2తో పాటు స్టైలో గో2ను ఫ్రీగా అందిస్తోంది.
ఆడియో ప్రొడక్టుల విషయానికి వస్తే..
వన్‌ప్లస్ బడ్స్ 4ను రూ. 6,099కు, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను రూ. 11,999కు సొంతం చేసుకోవచ్చు. అలాగే, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3, నార్డ్ బడ్స్ 3 ప్రో, నార్డ్ బడ్స్ 4 ప్రో, బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ఏఎన్‌సీ బుల్లెట్స్ వైర్‌లెస్ Z3లపై కూడా డిస్కౌంట్లు పొందొచ్చు.
