OnePlus N6 Lite : పండగ చేస్కోండి.. 7,000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ N6 లైట్ అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?

OnePlus N6 Lite : భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 లైట్‌ వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం కంపెనీ 5MP ఫ్రంట్ కెమెరా అద్భుతంగా ఉంది. పూర్తి ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే..

  • Published on- September 22, 2026 / 09:30 PM IST

OnePlus N6 Lite

  • ఫోన్ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరాతో వస్తుంది
  • ఈ ఫోన్‌లో ఆక్వా టచ్ టెక్నాలజీని అందించారు
  • ఇది తడి చేతులతో కూడా రన్ అవుతుంది
  • వన్‌ప్లస్ N6 లైట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది

OnePlus N6 Lite : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 లైట్‌ ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ సరికొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

ఇందులో 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం కంపెనీ 5MP ఫ్రంట్ కెమెరా అందించింది. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 7000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు (OnePlus N6 Lite) కూడా సపోర్టు ఇస్తుంది. ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..

భారత్‌లో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 లైట్ ధర రూ. 16,999గా ఉంది. కంపెనీ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అనే సింగిల్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను అధికారిక వెబ్‌సైట్ (OnePlus.in)తో పాటు అమెజాన్ నుంచి కూడా కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ N6 లైట్ మిడ్‌నైట్ హైప్, నియో గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వన్‌ప్లస్ N6 లైట్ ఫీచర్లు :

ఈ వన్‌ప్లస్ ఫోన్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో 6.75-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఆక్వా టచ్ టెక్నాలజీని అందించింది. చేతులు తడిగా ఉన్నప్పటికీ స్క్రీన్ రెస్పాండ్ అవుతుంది. ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్‌లో UNISOC T7250 చిప్‌సెట్ ఉంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అందిస్తుంది.

Read Also : Vivo V80 India Launch : 7,200mAh బ్యాటరీతో కొత్త వివో V80 వచ్చేస్తోందోచ్.. అక్టోబర్ 6నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

కెమెరా విషయానికి వస్తే..
ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్13MP మెయిన్ కెమెరా ఉంది. 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ N6 లైట్ భారీ 7000mAh బ్యాటరీతో వస్తుంది.

కంపెనీ 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. 3 రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే.. 6 ఏళ్ల వరకు ఈజీగా లైఫ్ అందిస్తుంది.

ఈ ఫోన్‌లో డ్యూయల్ 4జీ VoLTE, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, GLONASS, గెలిలియో, QZSS, Beidou, USB టైప్-సి వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ కంపెనీ ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇచ్చింది. ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.