OnePlus Nord 6 Review : గేమర్లకు పండగే.. 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6 వస్తోంది.. ఛార్జింగ్ దిగదు.. ఫోన్ హీటెక్కదు..!
OnePlus Nord 6 Review : అత్యంత పవర్ ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏప్రిల్ 7న ఈ కొత్త వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ లాంచ్ కాగానే ఏప్రిల్ 9న సేల్ ప్రారంభం కానుంది.. ఫుల్ రివ్యూ ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published On : April 4, 2026 / 08:36 PM IST
OnePlus Nord 6 Review
- భారీ బ్యాటరీతో వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ వచ్చేస్తోంది
- ఈ నెల 7వ తేదీన భారత మార్కెట్లో లాంచ్
- ఏప్రిల్ 9న వన్ ప్లస్ నార్డ్ 6 ఫస్ట్ సేల్
- కేవలం 90 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్, గంటలోపు 80 శాతం ఛార్జ్
OnePlus Nord 6 Review : వన్‌ప్లస్ కస్టమర్లకు అద్భుతమైన న్యూస్.. అతి త్వరలోనే వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 6 ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 9,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో బ్యాటరీ లైఫ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో వినియోగదారులు గంటల తరబడి గేమింగ్ ఆడినా ఫోన్ ఛార్జింగ్ దిగదు.. అలాగే హీట్ కూడా అవ్వదు అనమాట.
గేమింగ్ ప్రియుల కోసం ఇందులో స్మూత్ 165Hz అమోల్డ్ ప్యానెల్ ఉంది. ఈ ఫోన్ బీజీఎంఐ వంటి గేమ్‌లలో వేడెక్కకుండా స్టేబుల్ 120FPS గేమింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అడ్వాన్స్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఎక్కువ వాడినా కూడా ఫోన్ కూల్ ఉంటుంది. గేమర్‌లు రోజంతా ఎంజాయ్ చేయొచ్చు.
పవర్, స్టోరేజ్ పరంగా ఎలా ఉందంటే? :
ఈ వన్‌ప్లస్ ఫోన్ భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు సుమారు 90 నిమిషాలు పడుతుంది. గంటలోపు 80 శాతం ఛార్జ్ అవుతుంది. మెరుగైన డేటా స్పీడ్, యాప్ పర్ఫార్మెన్స్ కోసం UFS 4.1 స్టోరేజ్ ఉంది. వినియోగదారులు ఫోన్‌ను పదేపదే ఛార్జింగ్‌కు పెట్టాల్సిన అవసరం ఉండదు.
Read Also : Ola Roadster X+ : జస్ట్ 1 రూపాయికే 5 కి.మీ.. ఓలా వారి వండర్ ఫుల్ బైక్.. రేటు ఎంతంటే.. జస్ట్!
భారత మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ 6 నేరుగా పోకో F7, రియల్‌మి 16 సిరీస్ మోడళ్లతో పోటీపడుతుంది. రూ. 40వేల లోపు ధరలో ఈ ఫోన్ పోటీదారులలో కన్నా భారీ బ్యాటరీని అందిస్తుంది. ఇతర కంపెనీలు సన్నని డిజైన్‌తో వస్తుండగా వన్‌ప్లస్ అధిక వినియోగం, గేమింగ్ పరంగా ప్రాధాన్యత ఇచ్చింది. పవర్ యూజర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
వన్ ప్లస్ నార్డ్ 6 అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఇందులో హై-ఎండ్ OIS కెమెరా, మల్టీటాస్కింగ్ కోసం అడ్వాన్స్ ర్యామ్ స్వాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్ 6లో ఇతర ఫీచర్లతో పాటు భారీ 9,000mAh బ్యాటరీ, పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 165Hz డిస్‌ప్లే ఉన్నాయి.
ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 7న సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుండగా కంపెనీ సేల్ తేదీని వెల్లడించింది. ఈ నార్డ్ 6 ఫోన్ లాంచ్ అయిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 9న ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
