×
Ad

OnePlus Nord CE 5 : వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్.. 7100mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఫోన్, జస్ట్ రూ.22,999కే..!

OnePlus Nord CE5 : వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus Nord CE5 (Image Credit To Original Source)

  • వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఆఫర్లు, డిస్కౌంట్లు
  • వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్ పై భారీ డిస్కౌంట్
  • రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌
  • నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా

OnePlus Nord CE5 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారీ బ్యాటరీతో 5G ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే.. వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు లభిస్తోంది.

లిమిటెడ్ టైమ్ వరకు కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నార్డ్ CE5 డిస్కౌంట్, ఆఫర్లు :
ఈ వన్‌ప్లస్ ఫోన్ అసలు ధర రూ. 24,999 ఉండగా ప్రస్తుతం రూ. 24,499కి కొనుగోలు చేయవచ్చు. అంటే రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో మీరు రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు.

OnePlus Nord CE5 (Image Credit To Original Source)

ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ.22,999కి తగ్గుతుంది. మీరు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఎంచుకోవచ్చు. తద్వారా నెలకు రూ. 4,083 నుంచి 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ కూడా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌తో ఫ్రీ మాగ్నెటిక్ కేసు, డిస్‌ప్లేపై లైఫ్ టైమ్ వారంటీని కూడా అందిస్తోంది.

Read Also : Reliance Jio : జియో కొత్త ప్లాన్ అదుర్స్.. యూట్యూబ్ ప్రీమియం, డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్.. నెలంతా ఎంజాయ్!

వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫీచర్లు :
ఈ వన్‌ప్లస్ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ అదిరిపోయే విజువల్స్, కలర్ ఆప్షన్లను అందిస్తుంది. మీ గేమింగ్, వీడియోలకు అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, సపోర్టింగ్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు రికార్డు చేయొచ్చు. అదనంగా, ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,100mAh బ్యాటరీతో వస్తుంది.