OnePlus Nord CE 6 Series : కొత్త వన్‌ప్లస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. మే 7నే లాంచ్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
OnePlus Nord CE 6 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? చిప్సెట్లు, భారీ బ్యాటరీలతో నార్డ్ సీఈ 6, సీఈ 6 లైట్ మే 7న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ ధృవీకరించింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
OnePlus Nord CE 6
- వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 సిరీస్ ఫోన్లు భారత్‌కు వచ్చేస్తున్నాయి
- వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6, సీఈ 6 లైట్ ధర ఎంత ఉండొచ్చంటే?
- మే 7 భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్టు కంపెనీ వెల్లడి
OnePlus Nord CE 6 Series : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. చైనా టెక్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. రాబోయే నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ స్మార్ట్ఫోన్లు మే 7న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ స్మార్ట్ఫోన్లు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్సెట్తో వస్తుంది. నార్డ్ సీఈ 6లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 Soc ఉంటుంది. ఈ ఫోన్లలో వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో పాటు ఎంఐఎల్-ఎస్టీడీ-810 సర్టిఫికేషన్ కూడా అందించే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 , నార్డ్ సీఇ 6 లైట్ ధర, స్పెసిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ మే 7, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కంపెనీ అధికారిక వెబ్సైట్, అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 పిచ్ బ్లాక్, లూనార్ పెర్ల్ ఫ్రెష్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ హైపర్ బ్లాక్ వివిడ్ మింట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Mark the date.#OnePlusNordCE6 #OnePlusNordCE6Lite pic.twitter.com/qTQRPsVDzZ
— OnePlus India (@OnePlus_IN) April 29, 2026
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ హ్యాండ్సెట్లు కెమెరా ఫీచర్లు ఒకేలా ఉండనున్నాయి. 50MP మెయిన్ బ్యాక్ కెమెరాసెన్సార్ ఆకర్షణీయంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నార్డ్ సీఈ 6 స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 SoC ద్వారా రన్ అవుతుంది.
8,000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, సీఈ 6 లైట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్ ఉంటుంది. 7,000mAh బ్యాటరీతో వస్తుంది. స్టాండర్డ్ మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1.5K రిజల్యూషన్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది.
ఈ వన్‌ప్లస్ ఫోన్లలో MIL-STD-810 సర్టిఫికేషన్‌తో పాటు వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP66, IP68, IP69, IP69K రేటెడ్ ప్రొటెక్షన్ కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 32MP సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంటాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని అంచనా. భారత మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ ధర రూ. 20వేల నుంచి రూ. 25వేల మధ్య ఉంటుందని అంచనా.
