OnePlus Pad 3 Pro : 13,000mAh బ్యాటరీ, 13-అంగుళాల డిస్‌ప్లేతో కొత్త వన్‌ప్లస్ టాబ్లెట్ వచ్చేస్తోంది.. గేమింగ్‌కు పర్‌ఫెక్ట్..!

OnePlus Pad 3 Pro : వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో 13.2-అంగుళాల 3.4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 13,000mAh బ్యాటరీ 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. పూర్తి వివరాలివే..

OnePlus Pad 3 Pro

  • భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో వచ్చేస్తోంది
  • 13,000mAh బ్యాటరీ 144Hz రిఫ్రెష్ రేట్
  • ఏప్రిల్ నెలఖారులో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం

OnePlus Pad 3 Pro : కొత్త టాబ్లెట్ కొంటున్నారా? వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో (వన్ ప్లస్ ప్యాడ్ 4) టీజ్ చేసింది. భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుందని అంచనా. పర్ఫార్మెన్స్ పరంగా ఈ టాబ్లెట్ చాలా పవర్‌ఫుల్. రిపోర్టుల ప్రకారం.. ఈ టాబ్లెట్‌లో భారీ స్క్రీన్, హై-ఎండ్ ప్రాసెసర్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటాయి.

వర్క్, ఎంటర్మైన్మెంట్ రెండింటికీ అద్భుతమైన ఆప్షన్. ముఖ్యంగా, వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ కేటగిరీలో శాంసంగ్ ఆపిల్ వంటి బ్రాండ్‌లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ, రిపోర్టుల ప్రకారం.. ఈ టాబ్లెట్ ఏప్రిల్ 2026లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో అకా వన్‌ప్లస్ ప్యాడ్ 4 ఫీచర్లు (అంచనా) :
లీకుల ప్రకారం.. వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రోలో 3.4K రిజల్యూషన్‌తో భారీ 13.2-అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్‌ కూడా ఉండవచ్చు. స్క్రోలింగ్, గేమింగ్ వీడియోలు చూడొచ్చు. ఈ టాబ్లెట్ పర్ఫార్మెన్స్ అతిపెద్ద ఆకర్షణగా చెప్పొచ్చు. నివేదికల ప్రకారం.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండవచ్చు. ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పీడ్ అందిస్తుంది.

Read Also : Bajaj Dominar 400 : కొంటే ఇలాంటి బైకు కొనాలి.. బజాజ్ డొమినార్ 400 కొత్త అవతార్‌ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుందని అంచనా. మల్టీటాస్కింగ్ హై-ఎండ్ గేమింగ్ ఈజీగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఇందులో 16GB వరకు ర్యామ్ ఉండవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రోలో భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా.

నివేదికల ప్రకారం.. ఇందులో సుమారు 13,000mAh బ్యాటరీ ఉండవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేయొచ్చు. టాబ్లెట్ ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది ఎక్కువ టైమ్ ఉండాల్సిన అవసరం ఉండదు.

కెమెరా విషయానికి వస్తే.. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13MP రియర్ కెమెరా ఉంటుందని అంచనా. అదనంగా, Wi-Fi, బ్లూటూత్ ఇతర కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో డాన్ గోల్డ్, మోచా బ్రౌన్ మోనెట్ పర్పుల్ వంటి కలర్ ఆప్షన్లలో రానుంది.