OnePlus Pad Model : కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ భలే ఉందిగా.. 8000mAh భారీ బ్యాటరీతో వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు..!

OnePlus Pad Model : కొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌ లాంచ్ కాబోతుంది. గత నెలలో భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 4 లాంచ్ కానుంది. ఈ ప్యాడ్ 4లో 13.2-అంగుళాల 3.4K ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. పూర్తి ఫీచర్లపై అంచనాలివే..

OnePlus Pad Model

  • అతి త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ ప్యాడ్ మోడల్‌
  • 8.8-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌
  • 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌, 8000mAh బ్యాటరీ

OnePlus Pad Model : కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేస్తోంది. గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయిన కంపెనీ కొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌గా లాంచ్ కానుంది. ఈ ప్యాడ్ 4లో 13.2-అంగుళాల 3.4K ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ప్యాడ్ 4కు ముందు వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 భారత మార్కెట్లో సింగిల్ మిడ్-రేంజ్ టాబ్లెట్‌గా లాంచ్ అయింది. ఇందులో కూడా LCD డిస్‌ప్లే ఉంది.

కంపెనీ భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్‌లో సరికొత్త టాబ్లెట్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చని అంచనా. వన్‌ప్లస్ ప్యాడ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇటీవల లాంచ్ అయిన ఒప్పో ప్యాడ్ మినీకి దగ్గరి పోలికలు ఉన్నట్లు కనిపిస్తోంది.

వన్‌ప్లస్ ప్యాడ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. టెక్ కంపెనీ త్వరలో భారత మార్కెట్లో ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌తో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్ టాబ్లెట్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కూడా రివీల్ చేశారు. ఒప్పో ప్యాడ్ మినీని పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, రాబోయే వన్‌ప్లస్ టాబ్లెట్ అదే టాబ్లెట్ రీబ్రాండెడ్ వెర్షన్ అవునో కాదో క్లారిటీ ఇవ్వలేదు.

Read Also : Lenovo IdeaPad Slim 5i : వారెవ్వా.. కొంటే లెనోవో ల్యాప్‌టాప్ కొనాలి.. AI ఫీచర్లు మాత్రం హైలెట్.. ధర తెలిస్తే షాకవుతారు..!

వన్‌ప్లస్ ప్యాడ్‌లో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 8.8-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఈ టాబ్లెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, LPDDR5x ర్యామ్ UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్ ఓఎల్ఈడీ-స్క్రీన్ టాబ్లెట్లు, ఆండ్రాయిడ్ 16తో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.

కెమెరాల విషయానికి వస్తే..
కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ సిరీస్ టాబ్లెట్‌లో 13MP సింగిల్ రియర్ కెమెరాతో వస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు. ఈ టాబ్లెట్‌లో 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పాటు 8,000mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా.

వన్‌ప్లస్ ప్యాడ్ మినీ గత నెల ఏప్రిల్ 21న చైనాలో లాంచ్ అయింది. ప్రారంభ ధర 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ కోసం CNY 3,699 (సుమారుగా రూ. 51వేలు)గా నిర్ణయించారు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 62వేలు)గా ఉంది.