×
Ad

Oppo Find X8 Pro : వండర్‌ఫుల్ డీల్.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్, ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

Oppo Find X8 Pro : ఒప్పో కొత్త ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రూ. 16,700 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 23, 2026 / 02:31 PM IST
1/7
Oppo Find X8 Pro : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో ఇటీవలే భారత మార్కెట్లో ఫైండ్ X9 సిరీస్‌ లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఇప్పుడు గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ అమెజాన్‌లో రూ. 16,700 కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.
2/7
పాత మోడల్ అయినా ఫైండ్ X8 ప్రో పవర్‌ఫుల్ కెమెరా సిస్టమ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్-లెవల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ప్రస్తుత అమెజాన్ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో రూ.99,999కు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.86,990కు లిస్ట్ అయింది. అంటే రూ.13,009 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
4/7
మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా సేవింగ్ చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోండి.
5/7
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌ అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,910mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది.
6/7
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ LYT808 ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంది.
7/7
అలాగే 6x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 సెన్సార్, 120x డిజిటల్ జూమ్ వరకు 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.