Oppo Find X9 : ఒప్పో ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. భారత్‌లో OPPO ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఇప్పుడే కొనడం బెటరా?
Oppo Find X9 : ఒప్పో ఫ్యాన్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 ధరలు భారీగా పెరగనున్నాయి. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధరలు ఎంత పెరగనున్నాయంటే?
Oppo Find X9 ( Image Credit : AI )
- భారత్‌లో ఒప్పో ఫైండ్ X9 ధర త్వరలో రూ. 10వేలకు పెంపు
- ఒప్పో ఫైండ్ X9, ఫైండ్ X9s మధ్య ధరల తేడా తగ్గే అవకాశం
- ఒప్పో ఈ ఫోన్ ధర పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు
Oppo Find X9 : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ x9 భారీగా పెరగనున్నాయి. లీక్ డేటా ప్రకారం.. ఒప్పో వివిధ స్టోరేజ్ వేరియంట్లలో ఫోన్ ధరను రూ. 10వేల వరకు పెంచవచ్చు. ఒప్పో ఫైండ్ X9, కొత్త ఫైండ్ x9s మధ్య ధర తేడా ఎక్కువగా ఉంటుందని పుకార్లు వస్తున్నాయి.
ఒప్పో ఇంకా ఈ ధరల మార్పుపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పెరుగుతున్న స్పేర్ పార్టుల ధరలు, సరఫరా సమస్యల కారణంగా కంపెనీ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ లీక్ ధరల వివరాలు కీలక స్పెసిఫికేషన్లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ధర పెంపు? :
టిప్‌స్టర్ ప్రకారం.. భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 ధర రూ. 10వేల వరకు పెరగనుందని అంచనా. రూ. 74,999కి లాంచ్ అయిన ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB మోడల్ త్వరలో రూ. 84,999కి విక్రయించే అవకాశం ఉంది. అదేవిధంగా, టాప్-ఎండ్ 16GB ర్యామ్ + 512GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 84,999కి బదులుగా ఇప్పుడు రూ. 94,999కి లభించనుంది.
అయితే, ధరల పెంపుపై ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ X9s మధ్య వ్యత్యాసం కేవలం రూ. 5వేలు మాత్రమే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ల ధర పెరిగితే చిప్సెట్ కొరతే ప్రధాన కారణమని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. కేవలం ఒప్పో మాత్రమే కాదు.. ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా స్మార్ట్ఫోన్ల ధరలను పెంచారు.
ఒప్పో ఫైండ్ X9 స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.59-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. టాప్ బ్రైట్నెస్ 3,600 నిట్స్ వరకు అందిస్తుంది. సన్ లైటింగ్ పడినా డిస్ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. గీతలు, కింద పడినా డిస్ప్లే దెబ్బతినకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా ఉంది.
ఈ ఒప్పో ఫోన్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,025mAh బ్యాటరీ కూడా అందిస్తుంది. 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే..
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ హస్సెల్‌బ్లాడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో కూడా వస్తుంది. అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ తీసుకోవచ్చు.
ఒప్పో ఏం చెప్పింది? :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ధరల పెంపునకు సంబంధించి కంపెనీ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అధికారిక వెబ్సైట్లో ధరలు కూడా మారలేదు. ఒకవేళ ధరలు పెంచితే మే 26, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావచ్చు.
