OPPO K14 5G Sale : ఒప్పో K14 5G ఫస్ట్ సేల్.. 7000mAh భారీ బ్యాటరీ, AI కెమెరా ఫీచర్లు కేక.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
OPPO K14 5G Sale : ఒప్పో K14 5G ఫోన్ సేల్ మొదలైంది. ఇప్పుడు భారత మార్కెట్లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 20, 2026 / 04:28 PM IST
OPPO K14 5G Sale
- ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K14 5G ఫోన్ ఫస్ట్ సేల్
- మార్చి 20న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం
- 3 కాన్ఫిగరేషన్‌లలో ఒప్పో K14 5G ఫోన్
- ధర, స్పెషిఫికేషన్లు, ఆఫర్ల సంబంధించి పూర్తి వివరాలు
OPPO K14 5G Sale : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన ఒప్పో K14 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. మార్చి 20న ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఒప్పో 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్, మన్నిక పరంగా రోజువారీ వినియోగం కోసం అద్భుతంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్ ద్వారా కొనేసుకోవచ్చు. ధర, స్పెషిఫికేషన్లు, ఆఫర్ల సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ధర, వేరియంట్లు, ఆఫర్లు :
ఒప్పో K14 5G ఫోన్ 3 కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.
6GB + 128GB: రూ. 17,999
6GB + 256GB: రూ. 19,999
8GB + 256GB: రూ. 21,999
ఈ ఫోన్ ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్, ప్రిజం వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లలో కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో K14 5జీ ఫోన్ కాలింగ్, స్ట్రీమింగ్, నావిగేషన్, గేమింగ్ వంటి లాంగ్ డే కోసం 7000mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సుమారు 30 నిమిషాల్లో ఒక శాతం నుంచి 37శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇందులో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది.
పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే :
ఒప్పో K14 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.75-అంగుళాల డిస్‌ప్లే అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. కలర్‌ఓఎస్ 15తో వస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతమైన పర్ఫార్మెన్స్, కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.
ఒప్పో ట్రినిటీ ఇంజిన్, ఏఐ లింక్‌బూస్ట్ 3.0 ఉన్నాయి. ఎక్కువ సేపు వాడేటప్పుడు వేడిని కంట్రోలింగ్ కోసం ఈ ఫోన్‌లో 3900mm² VC, అదనపు గ్రాఫైట్ లేయర్లతో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
కెమెరాలు, ఫీచర్లు :
కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో K14 5G ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
- 50MP ఏఐ మెయిన్ కెమెరా
- 2MP డెప్త్ సెన్సార్
- 8MP ఫ్రంట్ కెమెరా
ఇందులో ఏఐ రీకంపోజ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి ఏఐ-ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్, రియర్ కెమెరాలు రెండింటి నుంచి రికార్డింగ్ కోసం డ్యూయల్-వ్యూ వీడియో ఉంది.
మన్నిక, డిజైన్ :
ఈ ఫోన్ ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. SGS 5-స్టార్ సర్టిఫికేషన్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు వంటి పరిస్థితుల నుంచి ప్రొటెక్షన్ కోసం IP66, IP68, IP69 రేటింగ్ సర్టిఫికేషన్లు ఉన్నాయి.
లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ :
కాలక్రమేణా పర్ఫార్మెన్స్ స్థిరంగా ఉంటుంది. ఒప్పో K14 5Gలో నెలవారీ మేనేజ్‌మెంట్ సపోర్టు, 60 నెలల వరకు ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ ఉంటుందని ఒప్పో చెబుతోంది.
