Oppo Reno 12 Price : సూపర్ డిస్కౌంట్ బాస్.. ఇలా కొంటే అతి చౌకైన ధరకే ఒప్పో రెనో 12 మీ సొంతం..!
Oppo Reno 12 : ఒప్పో రెనో 12పై డిస్కౌంట్ అదిరింది.. ఫీచర్లు మాత్రం అదుర్స్.. సరసమైన ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?

Oppo Reno 12 Price
Oppo Reno 12 Price : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారి కోసం అదిరే ఆఫర్.. ప్రస్తుతం (Oppo Reno 12 Price) ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 12 ఫోన్ రూ.13,200 కన్నా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
ఇంత తక్కువ ధరకు ఒప్పో ఫోన్ మళ్లీ రాదు.. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు కూడా ఉండవు. అతి తక్కువ ధరలో ఒప్పో రెనో 12 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్ ఒప్పో రెనో 12 డీల్ (Oppo Reno 12 Price) :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 12 రూ.32,999 కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఒప్పో ఫోన్ రూ.20,999 కు జాబితా అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రెనో 12 ఫోన్‌పై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత సేవింగ్ చేయొచ్చు.
ఒప్పో రెనో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Oppo Reno 12 Price) :
ఒప్పో రెనో 12 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.
హుడ్ కింద రెనో 12 మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్‌సెట్ పవర్ పొందుతుంది. ఇంకా, ఈ ఒప్పో ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 12 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఒప్పో ఫోన్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ రెనో హ్యాండ్‌సెట్ ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ రైటర్, ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.