OnePlus 13s : వన్‌ప్లస్ 13s ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. ఇలాంటి ఫోన్ మళ్లీ దొరకదు..!

OnePlus 13s : వన్‌ప్లస్ 13s ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఈ ఫోన్ సేల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది..

OnePlus 13s : వన్‌ప్లస్ 13s ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. ఇలాంటి ఫోన్ మళ్లీ దొరకదు..!

OnePlus 13s

Updated On : June 5, 2025 / 2:31 PM IST

OnePlus 13s : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ నుంచి డ్యూయల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 13s ఫోన్ (OnePlus 13s) వచ్చేసింది. భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది.

కంపెనీ ప్రకారం.. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. డ్యూయల్ 50MP కెమెరా సెటప్, భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Read Also : Best Smartphones : 7000mAh బిగ్ బ్యాటరీతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ రెండు (12GB+256GB, 12GB+512GB) వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్లస్ కీతో కూడా వస్తుంది. అలర్ట్ స్లైడర్‌ ఉండదు.

ఇమేజ్, పర్ఫార్మెన్స్ కోసం అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ 13 ధర, స్పెషిఫికేషన్లు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు (OnePlus 13s) :
వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 460 పీపీఐతో 6.32-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 1,600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో డాల్బీ విజన్, HDR10+, HDR వివిడ్ సపోర్టు అందిస్తుంది.

హుడ్ కింద ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ 12GB LPDDR5X, 256GB, 512GB UFS 4.0తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

థర్మల్ కోసం 4,400mm² 3D క్రయో-వెలాసిటీ వేపర్ చాంబర్, గ్రాఫైట్ లేయర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,850mAh బ్యాటరీని అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. (OnePlus 13s) :
ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ OISతో కూడిన 50MP సోనీ LYT-700, 50MP (2X ఆప్టికల్ జూమ్) టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 32MP, ఎఫ్/2.0, 90° FoVతో కూడిన 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్-సిమ్, USB టైప్-C, ఇన్-డిస్‌‌ప్లే ఫింగర్ ప్రింట్, ఐఆర్ రిమోట్, గైరోస్కోప్, ఇ-కంపాస్‌ కూడా అందిస్తుంది.

Read Also : Jio Recharge Plan : వారెవ్వా.. జియో రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ. 51కే అన్‌లిమిటెడ్ 5G డేటా.. నెలంతా వస్తుంది..!

భారత్‌లో వన్‌ప్లస్ 13s ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s ఫోన్ 12GB, 256GB వేరియంట్లకు ధర రూ. 54,999, 12GB ర్యామ్, 512GB వేరియంట్ ధర రూ. 59,999కు లభ్యం కానుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్, ఈ-స్టోర్, రిటైల్ పార్టనర్ల నుంచి ఈ వన్‌ప్లస్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ జూన్ 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది.