Best Smartphones : 7000mAh బిగ్ బ్యాటరీతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Best Smartphones : భారీ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphones : 7000mAh బిగ్ బ్యాటరీతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Best Smartphones

Updated On : June 5, 2025 / 12:48 PM IST

Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు (Best Smartphones) మార్కెట్లో లభ్యమవుతున్నాయి. లాంగ్ బ్యాటరీ ఫోన్లను కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఫోన్లు.

ప్రస్తుతం అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్లు ఇలా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : Tata Harrier EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా.. సింగిల్ ఛార్జ్‌తో 627 కి.మీ రేంజ్..!

ఐక్యూ Z10 :
ఐక్యూ Z10 ఫోన్ కేవలం 195 కిలోల బరువు, కేవలం 8.1mm మందం కలిగి ఉంది. 7,300mAh బ్యాటరీ కలిగి ఉంది. భారీ బ్యాటరీని ఉన్నప్పటికీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది.

ఐక్యూ 50MP OIS-ఎనేబుల్డ్ ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఐక్యూ Z10ఫోన్ ధర రూ. 21,999 నుంచి కొనుగోలు చేయొచ్చు.

వివో T4 :
ఐక్యూ Z10 మాదిరిగానే వివో T4 ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్, 7.9mm మందంతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. 5,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది.

6.77-అంగుళాల ఫుల్ HD+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్ కలిగి ఉంటుంది.

256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ((Best Smartphones) ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వివో ఫన్‌టచ్OS 15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అయ్యే ఈ వివో ఫోన్ ఏఐ ఎరేస్, ఫోటో ఎన్‌హాన్స్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు కలిగి ఉంది. ఈ వివో ఫోన్ ధర రూ. 21,999 నుంచి లభ్యమవుతుంది.

ఒప్పో K13 :
ఒప్పో K13 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్‌ కలిగి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 7000mAh బ్యాటరీ కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ పర్వాలేదు. ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ ధర రూ. 17,599 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Repo Rate Cut : ముచ్చటగా మూడోసారి ఆర్బీఐ ‘రెపో రేటు’ తగ్గుతుందా? అదే జరిగితే.. భారీగా తగ్గనున్న హోం, కారు లోన్లు..!

రియల్‌మి GT7 :
రియల్‌మి GT7లో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ. 39,999 నుంచి లభిస్తోంది.