Repo Rate Cut : ముచ్చటగా మూడోసారి ఆర్బీఐ ‘రెపో రేటు’ తగ్గుతుందా? అదే జరిగితే.. భారీగా తగ్గనున్న హోం, కారు లోన్లు..!

Repo Rate Cut : ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ ముచ్చటగా మూడోసారి రెపో రేటును తగ్గింపుపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

Repo Rate Cut : ముచ్చటగా మూడోసారి ఆర్బీఐ ‘రెపో రేటు’ తగ్గుతుందా? అదే జరిగితే.. భారీగా తగ్గనున్న హోం, కారు లోన్లు..!

Repo Rate Cut

Updated On : June 5, 2025 / 12:14 PM IST

Repo Rate Cut : రిజర్వ్ బ్యాంకు ముచ్చటగా మూడోసారి రెపో రేటును తగ్గించనుందా? ఆర్బీఐ (Repo Rate Cut) ఎలాంటి ప్రకటన చేయబోతుంది?. రెపో రేటు తగ్గింపుపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 0.50 శాతం తగ్గవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదే జరిగితే.. హోం లోన్లు, కార్ల లోన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC Meeting) సమావేశంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించనుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also : Redmi A4 5G : ఆఫర్ అదిరింది.. అతి చౌకైన ధరకే రెడ్‌మి 5G ఫోన్ కొనేసుకోండి.. మీ బడ్జెట్ ధరలోనే..!

ఈ ఎంపీసీ సమావేశం బుధవారమే (జూన్ 3) ప్రారంభం కాగా, మూడు రోజుల (జూన్‌ 6 వరకు) పాటు కొనసాగనుంది. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించనున్నారు.

మూడోసారి వడ్డీ రేట్లు తగ్గింపు? :
ఈ సమీక్ష సమావేశంలో ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ద్రవ్యోల్బణం 4 శాతం దిగువన ఉండటం, అమెరికా టారిఫ్‌ల కారణంగా వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గతంలో రెండుసార్లు 25 బేసిస్‌ పాయింట్లతో వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ మూడోసారి కూడా అంతే వడ్డీ రేట్లను తగ్గించనుందని అంచనా వేస్తున్నారు.

50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు :
ఆర్బీఐ రెపో రేటును 0.50 శాతం లేదా 50 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని పేర్కొంది. కానీ, ఎస్బీఐ రీసెర్చ్‌ కోత 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది. జూన్‌లోనే ‘జంబో కట్‌’కు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.

ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో 6 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ మళ్లీ 25 బేసిస్ పాయింట్లను ప్రకటిస్తే వరుసగా మూడోసారి రెపో రేటు తగ్గనుంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లోనే రెపో రేటు ఒక శాతం మేర తగ్గుతుంది.

Read Also : Tata Harrier EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా.. సింగిల్ ఛార్జ్‌తో 627 కి.మీ రేంజ్..!

ఆర్‌బీఐ ప్రకటనకు అనుగుణంగా రెపో రుణ రేట్లను, ఎంసీఎల్‌ఆర్‌ను అనేక బ్యాంకులు భారీగా తగ్గించాయి. మూడోసారి కూడా రెపో రేటును తగ్గిస్తే లోన్లు తీసుకున్నవారు మరింత రిలీఫ్ పొందవచ్చు. రెపో రేటు తగ్గితే.. లోన్ ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఫలితంగా గృహ రుణం, కారు రుణాలు చౌకగా మారుతాయి.