Redmi A4 5G : ఆఫర్ అదిరింది.. అతి చౌకైన ధరకే రెడ్‌మి 5G ఫోన్ కొనేసుకోండి.. మీ బడ్జెట్ ధరలోనే..!
Redmi A4 5G : రెడ్‌మి A4 5G ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చ.

Redmi A4 5G phone
Redmi A4 5G : కొత్త రెడ్‌మి 5G ఫోన్ కావాలా? అమెజాన్‌లో అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి A4 5G ఫోన్ (Redmi A4 5G) అందుబాటులో ఉంది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈఎంఐ ఆప్షన్ కేవలం రూ.412కే పొందవచ్చు. 5160mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. మీరు ఈ రెడ్‌మి ఫోన్ ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు.
రెడ్‌మి A4 5G ఆఫర్లు :
రెడ్‌మి A4 5G ఫోన్ 2 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అందులో 4GB ర్యామ్ + 64GB, 4GB ర్యామ్ + 128GB ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 8,498 ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 9,498కు ఆఫర్ చేస్తోంది.
మిగతా వేరియంట్ల ధరలు రూ. 10,999, రూ. 11,999 లభ్యమవుతున్నాయి. పర్పుల్, బ్లాక్ అనే మీరు రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ కొనుగోలుపై రూ. 254 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 412 ఈజీ ఈఎంఐతో లభిస్తుంది.
రెడ్‌మి A4 5G స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. TUV ట్రిపుల్ సర్టిఫైడ్ ఐకేర్ ప్రొటెక్షన్, 600 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది.
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 4s జనరేషన్ 2 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ 4GB ర్యామ్ కలిగి ఉంది. 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఎక్కువ స్టోరేజీని పెంచుకోవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది.
పవర్‌ఫుల్ 5,160mAh బ్యాటరీతో రెడ్‌మి A4 5G లాంగ్ బ్యాటరీని అందిస్తుంది. 18W USB టైప్-C ఛార్జింగ్, 33W ఛార్జర్‌తో వస్తుంది. ఇందులో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ వైఫై వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also : Jio Cheapest Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. జియో చీపెస్ట్ ప్లాన్‌తో 336 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
బ్యాక్ సైడ్ రెడ్‌మి A4 5G డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ ఏఐ కెమెరా, సెకండరీ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా కూడా ఉంది. ఈ రెడ్‌మి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా HyperOSపై రన్ అవుతుంది.