Motorola Razr 50 Ultra : కిర్రాక్ డిస్కౌంట్.. మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి!
Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 24వేలు తగ్గింది.

Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra : మోటోరోలా అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. మోటోరోలా మడతబెట్టే ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలా ఫ్లిప్ ఫోన్లు స్టైలిష్‌గా ఉంటాయి. పర్ఫార్మెన్స్ డిస్‌ప్లే, కెమెరాతో (Motorola Razr 50 Ultra) మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..
మోటోరోలా ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా డీల్ అసలు వదులుకోవద్దు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 99,999 ఉండగా మోటో ఏఐ ఫీచర్లు, స్టైలిష్ ఫారమ్ ఫ్యాక్టర్, అదిరిపోయే స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ధర ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో రెజర్ 50 అల్ట్రా ధర :
ప్రస్తుతం మోటోరోలా రెజర్ 50 అల్ట్రా రూ.79,999 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99,999 నుంచి తగ్గింపు పొందింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ధర రూ.76వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
మోటోరోలా ఫోన్ కస్టమర్లు పాత ఫోన్ మోటోరోలా రేజర్ 50 అల్ట్రాతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్ బట్టి బెస్ట్ వాల్యూను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 10 రోజుల రిప్లేస్ వారంటీని కూడా అందిస్తోంది. కస్టమర్లు నెలకు రూ.3,917 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటరోలా రెజర్ 50 అల్ట్రా (Motorola Razr 50 Ultra)లో 6.9-అంగుళాల FHD+ pOLED మెయిన్ డిస్‌ప్లే, 4-అంగుళాల pOLED కవర్ స్క్రీన్ ఉన్నాయి.
రెండు స్క్రీన్‌లు HDR10+కి సపోర్టు ఇస్తాయి. 165Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఛార్జింగ్, 15W వైర్‌లెస్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ మోటోరోలా మడతబెట్టే ఫోన్ డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటో ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంది.