Vivo T4 Ultra 5G : అదిరే ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 11నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T4 Ultra 5G : వివో నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతుంది. ఈ నెల 11న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo T4 Ultra 5G
Vivo T4 Ultra 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే వారం భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా 5G ఫోన్ లాంచ్ కానుంది.
ఫ్లిప్‌కార్ట్ రాబోయే ఈ ఫోన్‌కు సంబంధించి కీలక ఫీచర్లు, డిజైన్, కలర్ ఆప్షన్లను రివీల్ చేయనుంది. వివో T4 అల్ట్రా కొత్త 50MP పెరిస్కోప్ లెన్స్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో రానుంది.
Read Also : OnePlus 12 5G : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 12 5Gపై భారీ తగ్గింపు.. ఇంత తక్కువలో వస్తుంటే కొనాల్సిందే..!
అంతేకాదు.. pOLED 120Hz క్వాడ్-కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోపేజీ లైవ్ అయింది. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లతో సహా రాబోయే వివో T4 అల్ట్రా ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.
వివో T4 అల్ట్రా 5G లాంచ్ తేదీ :
ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా లాంచ్ కానుంది. ఈ వివో మోడల్ 2 వేర్వేరు కలర్ ఆప్షన్లలో రానుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్, రిటైల్ స్టోర్లలో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.
వివో T4 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
వివో T4 అల్ట్రా 5G ఫోన్ 16.94cm (6.67-అంగుళాల) pOLED క్వాడ్ కర్వ్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవుతుంది. ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తుంది.
5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 2 మిలియన్ AnTuTu స్కోర్‌లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
వివో అల్ట్రా ఫోన్ LPDDR5X, UFS 3.1తో రావచ్చు. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP69 సర్టిఫికేషన్ పొందవచ్చు.
ఈ వివో ఫోన్ 50MP సోనీ IMX921 మెయిన్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ కెమెరా లెన్స్, 10x టెలిఫోటో మాక్రో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వివో ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు.
Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..
వివో T4 అల్ట్రా ధర (అంచనా) :
ఈ వివో ఫోన్ ధర రూ. 30వేలు, రూ. 35వేలు ఉంటుందని అంచనా. కచ్చితమైన ధర రివీల్ కాలేదు. వివో T3 అల్ట్రా 5G భారత మార్కెట్లో రూ. 31,999కి లాంచ్ అయింది.