Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..

Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ 16పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే..

Apple iPhone 16

Updated On : June 4, 2025 / 5:18 PM IST

Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ క్రేజే వేరు.. ఐఫోన్ కొనాలని అందరికి ఉంటుంది. ఖరీదు ఎక్కువగా ఉండటంతో (Apple iPhone 16) పెద్దగా ఆసక్తి చూపరు. అదే ఐఫోన్ అతి తక్కువ ధరలో వస్తుంటే ఎవరు వద్దంటారు. వెంటనే కొనేస్తారు.

మీరు కూడా కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. విజయ్ సేల్స్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 పై భారీ తగ్గింపును అందిస్తోంది.

Read Also : Nothing Phone 2a Plus : సూపర్ డిస్కౌంట్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ కేవలం రూ. 9,259 మాత్రమే.. డోంట్ మిస్!

గతంలో కన్నా సరసమైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ రిటైలర్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16 డీల్ ఎంతంటే? :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16) రూ. 79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో రూ. 72,900కు లిస్టు అయింది. రిటైలర్ ఐఫోన్ 16పై రూ. 7వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

అలాగే, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నో-కాస్ట్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ (Apple iPhone 16) 60hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేతో 2వేల నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ లేయర్ కలిగి ఉంది. HDR డిస్‌ప్లే , ట్రూ టోన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

ఐఫోన్ 16లో A18 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఐఫోన్ 16 మోడల్ IP68 సర్టిఫికేట్ పొందింది.

Read Also : OnePlus 12 5G : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 12 5Gపై భారీ తగ్గింపు.. ఇంత తక్కువలో వస్తుంటే కొనాల్సిందే..!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 16లో 48MP ఫ్యూజన్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్, 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.