Oppo Reno 14 5G : వావ్.. ఆఫర్ అదిరింది బ్రో.. ఈ ఒప్పో 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ధర జస్ట్ ఎంతంటే?

Oppo Reno 14 5G : మీరు కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్ రూ. 50 వేల లోపు అయితే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. పూర్తి ఆఫర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

Oppo Reno 14 5G

  • ఒప్పో రెనో 14 5జీ బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు
  • 6.59-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే సెటప్
  • 6,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా

Oppo Reno 14 5G : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.40వేల నుంచి రూ. 50వేల మధ్య ఉంటే ఈ ఆఫర్ మీకోసమే.. కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు.గత ఏడాదిలో లాంచ్ అయిన ఒప్పో రెనో 14 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్‌తో లభిస్తోంది. ఆసక్తిగల యూజర్లు పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా డబ్బులు సేవ్ చేయొచ్చు. ఒప్పో రెనో 14 5జీ ఫోన్ డిస్కౌంట్లు, ధర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

ఒప్పో రెనో 14 5జీ ధర, ఆఫర్లు :
ఒప్పో రెనో 14 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.44,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే రూ.2,250 తగ్గింపు పొందవచ్చు, దాంతో అసలు ధర రూ.34,999కి తగ్గుతుంది.

అయితే, మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ.35,100 వరకు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, పూర్తి బెనిఫిట్స్, ఎక్స్చేంజ్ చేసే డివైజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌ ఆధారంగా ధర తగ్గొచ్చు లేదా పెరగొచ్చు.

Read Also : HONOR Pad 20 Pro : కొత్త ట్యాబ్ కావాలా? 10100mAh బ్యాటరీతో కొత్త హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్.. ధర ఎంతంటే?

ఒప్పో రెనో 14 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ ఒప్పో 5జీ ఫోన్ 1256×2760 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.59-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఒప్పో ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఒప్పో రెనో 14 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.