POCO C81 Pro : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో C81 ప్రో వచ్చేసింది.. 256GB స్టోరేజీ ఫోన్ జస్ట్ రూ. 16వేలకే..!
POCO C81 Pro : పోకో సి81 ప్రో అతి చౌకైన ధరకే లాంచ్ అయింది. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ పోకో ప్రో ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- June 22, 2026 / 04:25 PM IST
POCO C81 Pro Launches
- పోకో C81 ప్రో, ఆక్టా-కోర్ ప్రాసెసర్, యునిసోక్ T7250 చిప్‌సెట్
- 13MP మెయిన్ కెమెరా, వెట్ టచ్ టెక్నాలజీ 2.0కి సపోర్టు
- ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ సెటప్
POCO C81 Pro : షావోమీ పోకో C81 ప్రో వచ్చేసింది.. ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో కూడా లాంచ్ అయింది. ఈ కంపెనీ పోకో C81 ప్రోను ఏప్రిల్ 2026లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఈ బ్రాండ్ యూరోపియన్ దేశాలలో కూడా లాంచ్ చేసింది.
ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఆక్టా-కోర్ చిప్‌తో రన్ అవుతుంది. 256GB వరకు స్టోరేజ్ (POCO C81 Pro) అందిస్తుంది. బ్లాక్, గ్రీన్, గోల్డ్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ పోకో కొత్త ఫోన్ ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో C81 ప్రో గ్లోబల్ ధర ఎంతంటే? :
కంపెనీ యూరోపియన్ మార్కెట్లో పోకో C81 ప్రోను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ జర్మనీ, స్పెయిన్‌లో కొత్త మోడల్ లాంచ్ చేసింది. జర్మనీలో, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 13,500 ఉంటుంది. 4GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 16వేలు ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలీఎక్స్‌ప్రెస్‌లో కూడా కొనేసుకోవచ్చు.
పోకో C81 ప్రో స్పెసిఫికేషన్లు :
పోకో C81 ప్రో ఫోన్ 1,600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డ్యూయల్-సిమ్ (నానో) C81 ప్రో, యునిసోక్ T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 13MP ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
పోకో కొత్త ఫోన్ వెట్ టచ్ టెక్నాలజీ 2.0కు సపోర్ట్ చేస్తుంది. తడి వేళ్లతో కూడా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. పోకో C81 ప్రో ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 79 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. పోకో C81 ప్రోలో బ్లూటూత్ 5.2, Wi-Fi, జీపీఎస్, GLONASS, గెలీలియో, NFC, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. కొలతల పరంగా పరిశీలిస్తే.. 171.56mm పొడవు, 79.47mm వెడల్పు, 8.15mm మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది.
