Poco M8 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డీల్.. పోకో M8పై భారీ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
Poco M8 Price : పోకో ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ.17,500 కన్నా ఎక్కువగా తగ్గింది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : March 14, 2026 / 12:30 PM IST
Poco M8 Price
- ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8పై భారీ తగ్గింపు
- బ్యాంక్ ఆఫర్లతో రూ.17,500కు పైగా డిస్కౌంట్
- పాత స్మార్ట్‌ఫోన్‌లపై ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
Poco M8 Price : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి దిమ్మతిరిగే ఆఫర్. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో పోకో ఎం8 ఫోన్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. బ్యాంకు, కార్డు ఆఫర్లతో ఇంకా తక్కువకే కొనొచ్చు. ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
పోకో M8 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
పోకో ఎం9 ఫోన్ అసలు ధర రూ. 18,999 ఉండగా కేవలం రూ. 17,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 900 డిస్కౌంట్ పొందవచ్చు, అలాగే నెలకు రూ. 3వేల నుంచి ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 13,900 వరకు పొందవచ్చు.
పోకో M8 స్పెసిఫికేషన్లు :
పోకో M8 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 8GB ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందిస్తుంది. 5,520mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2తో వస్తుంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో 50MP రియర్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ సైడ్ 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
