POCO X7 5G Price : రూ.25,000 పోకో 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ.17,000కే.. ఇలా కొన్నారంటే ఇంకా చీప్..!

POCO X7 5G Price Drop : పోకో ఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్‌ సందర్భంగా రూ. 25వేల విలువైన ఈ 5జీ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

POCO X7 5G Price Drop

  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో X7 5G ఫోన్ భారీ తగ్గింపు
  • OIS EIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా
  • 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ సెటప్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్‌

POCO X7 5G Price Drop : పోకో ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. పోకో X7 5G అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ సందర్భంగా ఈ పోకో ఫోన్‌ను తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.. ఈ ఫోన్‌లో భారీ 5500mAh బ్యాటరీ ఉంది.

ఇందులో 50MP రియర్ కెమెరాతో పాటు 3 కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌తో వస్తుంది. పోకో X7 5జీ బెస్ట్ డీల్స్‌ ఎలా పొందాలో ఇప్పుుడ వివరంగా తెలుసుకుందాం..

పోకో X7 5జీ సేల్, ధర తగ్గింపు ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో ఎక్స్7 5జీ తగ్గింపు ధరకు లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తగ్గింపు ధరకు లభిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ అసలు ధర రూ.24,999గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ కొనుగోలుపై తగ్గింపుతో ధర రూ.17,999కి ఆఫర్ చేస్తోంది.

Read Also : Honor X9e Launch : 8,560mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు నో టెన్షన్!

పోకో X7 5జీ సేల్, బ్యాంక్ ఆఫర్లు :
మీరు పోకో ఎక్స్7 5జీని బ్యాంక్ ఆఫర్ ద్వారా కొంటే భారీ తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.900 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో అసలు ధర రూ.17,099కు తగ్గుతుంది.

పోకో X7 5జీ స్పెసిఫికేషన్లు :
పోకో X7 5జీ ఫోన్ 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 3,000nits వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. పోకో X7 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో LPDDR4 ర్యామ్ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ షూటర్ అందించారు. బ్యాక్ సైడ్ పోకో X7 5జీలో OIS EIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. పోకో X7 5జీ ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ ఫోన్ IP66+IP68+IP69 రేటింగ్‌ అందిస్తుంది.