Raksha Bandhan 2025 : ఈ రక్షా బంధన్ రోజున మీ సోదరి కోసం రూ. 25వేల లోపు 6 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారో మీ ఇష్టం

Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 వచ్చేస్తోంది. మీ సోదరికి ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారు. రూ. 25వేల లోపు 6 బెస్ట్ సెల్ఫీ కెమెరాఫోన్లు ఉన్నాయి.

Raksha Bandhan 2025 : ఈ రక్షా బంధన్ రోజున మీ సోదరి కోసం రూ. 25వేల లోపు 6 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారో మీ ఇష్టం

Raksha Bandhan

Updated On : August 7, 2025 / 1:04 PM IST

Raksha Bandhan 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ రక్షాబంధన్ 2025 సందర్భంగా మీ సోదరి కోసం రూ. 25వేల లోపు ధరలో బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు (Raksha Bandhan 2025) అందుబాటులో ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఫ్రంట్ కెమెరాలు, స్టైలిష్ డిజైన్‌లు, ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్ అందించే 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని మీ సోదరికి గిఫ్ట్ ఇవ్వొచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి..

వివో Y400 ప్రో (రూ. 24,999) :
మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. వివో Y400 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 50MP+2MP డ్యూయల్ మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

ఒప్పో K13 (రూ. 17,999) :
ఒప్పో K13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ స్క్రీన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మొబైల్ యూనిట్ 50MP+2MP డ్యూయల్ రియర్ లెన్స్‌తో పాటు 16MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉంది.

Read Also : Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 6,200 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (రూ. 22,999) :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ (Raksha Bandhan 2025) అందించే 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. డ్యూయల్ 50MP+13MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3a (రూ. 24,999) :
నథింగ్ ఫోన్ 3a 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. మొబైల్ యూనిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP+50MP+8MP మెయిన్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5 (రూ. 24,999) :
వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ OLED స్క్రీన్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ ప్రో-లెవల్ పిక్చర్ క్వాలిటీతో వస్తుంది. డ్యూయల్ 50MP+8MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M56 (రూ. 24,999) :
శాంసంగ్ గెలాక్సీ M56 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ ప్యానెల్‌ కలిగి ఉంది. ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌ కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP+8MP+2MP ట్రిపుల్ బ్యాక్ లెన్స్, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు సపోర్టు ఇస్తుంది.