Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 6,200 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై తగ్గింపు ధరకే లభిస్తుంది. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Oppo Reno 13 Price
Oppo Reno 13 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13 ధర తగ్గింది. ఈ స్టైలిష్, ప్రీమియం-లుకింగ్ ఫోన్ అతి తక్కువ ధరకే (Oppo Reno 13 Price) లభిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఒప్పో రెనో 13 అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒప్పో రెనో 13 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 (8GB+ 256GB వేరియంట్) రూ.39,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫోన్ రూ.34,988కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రెనో 13పై రూ.5,011 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 13 ఫోన్ 6.59-అంగుళాల 120Hz 1.5K స్మార్ట్ అడాప్టివ్ డిస్‌ప్లేతో 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 13 5Gలో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఇంకా, ఒప్పో రెనో 13లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 సర్టిఫైడ్ కలిగి ఉంది.