iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు..!
iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ రూ.70వేల లోపు ధరకు అందుబాటులో ఉంది.

iPhone 16 Price
iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.70వేల లోపు (iPhone 16 Price) ధరకు అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.
రూ.79,900 ధరకు ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, iOS 18 కలిగి ఉంది. కెమెరా సెటప్‌తో ఐఫోన్ 16 అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 రూ.69,999కి లిస్ట్ అయింది. రూ.9,901 తగ్గింపు పొందింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.65,999 సేవ్ అవుతుంది. మీ పాత ఫోన్ రూ.57,850 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధర మరింత తగ్గుతుంది.
ఈ ఐఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, గులాబీ టీల్ కలర్ ఆప్షన్లలో 3 స్టోరేజ్ వేరియంట్ (128GB, 256GB, 512GB)లలో లభిస్తుంది. అయితే, ఈ డీల్ 128GB వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 చిప్‌తో సపోర్టు ఇస్తుంది. 128GB స్టోరేజీతో వస్తుంది. iOS18 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.