Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 6,200 తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై తగ్గింపు ధరకే లభిస్తుంది. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Oppo Reno 13 Price

Oppo Reno 13 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13 ధర తగ్గింది. ఈ స్టైలిష్, ప్రీమియం-లుకింగ్ ఫోన్ అతి తక్కువ ధరకే (Oppo Reno 13 Price) లభిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఒప్పో రెనో 13 అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో రెనో 13 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 (8GB+ 256GB వేరియంట్) రూ.39,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫోన్ రూ.34,988కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రెనో 13పై రూ.5,011 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Read Also : iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు..!

ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 13 ఫోన్ 6.59-అంగుళాల 120Hz 1.5K స్మార్ట్ అడాప్టివ్ డిస్‌ప్లేతో 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 13 5Gలో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఇంకా, ఒప్పో రెనో 13లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 సర్టిఫైడ్ కలిగి ఉంది.