Realme 16 Prices Hike : బిగ్ షాక్.. ఇక రియల్‌మి 16 ఫోన్లు కొనడం కష్టమే.. ఒక్కసారిగా రూ.7 వేల వరకు పెరిగిన ధరలు..
Realme 16 Prices Hike : రియల్‌మి ఇండియాలో రియల్‌మి 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచింది. కొన్ని మోడళ్లు ఇప్పుడు ప్రారంభ ధరలతో పోలిస్తే రూ. 7వేల వరకు ఖరీదైనవిగా మారాయి. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- May 19, 2026 / 04:26 PM IST
Realme 16 Prices Hike
- రియల్‌మి 16 ప్రో ప్లస్ ప్రారంభ ధర నుంచి రూ. 7వేలకు పెరిగింది
- పెరుగుతున్న మెమరీ, స్పేర్ పార్టుల ఖర్చుల కారణంగా పెంపు
- రియల్‌మి 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లకు కొత్త ధరలు అమల్లోకి
Realme 16 Prices Hike : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? రియల్‌మి ఇండియా రియల్‌మి 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా పెంచింది. పెరుగుతున్న మెమరీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా కంపెనీ రియల్‌మి 16, రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ ఫోన్ల కొత్త ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త ధరల ప్రకారం.. రియల్‌మి 16 ప్రో ప్లస్ ఇప్పుడు ప్రారంభ ధర (Realme 16 Prices Hike) కన్నా రూ. 7వేల వరకు పెరిగింది. రియల్‌మి ఈ విషయాన్ని ఒక సర్క్యులర్ ద్వారా కమర్షియల్ పార్టనర్లు, రిటైలర్లకు తెలిపింది. ఈ కొత్త ధరలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్టు సమాచారం.
కొత్త ధరల ప్రకారం.. రియల్‌మి 16 ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర రూ. 31,999 నుంచి రూ. 33,999కి పెరిగింది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 36,999కి లభిస్తుంది. 12GB+256GB వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది.
రియల్‌మి 16 ప్రో విషయానికి వస్తే.. :
8GB+256GB వేరియంట్ ధర ఇప్పుడు రూ. 39,999గా ఉంది. 12GB+256GB మోడల్ ఇప్పుడు రూ. 42,999కి లభిస్తుంది. కంపెనీ రియల్‌మి 16 ప్రో ప్లస్ ధర కూడా పెంచింది. 8GB+128GB వేరియంట్ ఇప్పుడు రూ. 46,999కి, 8GB+256GB వేరియంట్ రూ. 48,999కి, 12GB+256GB మోడల్ రూ. 52,999కి అందుబాటులో ఉన్నాయి. కొత్త ధరలతో రియల్‌మి 16 ఇప్పుడు ప్రారంభ ధర కన్నా రూ. 4వేల వరకు ఎక్కువ పెరిగింది.
రియల్‌మి 16 ప్రో ధర రూ. 6వేల వరకు, రియల్‌మి 16 ప్రో ప్లస్ ధర రూ. 7వేల వరకు పెరిగాయి. ఈ ధరల పెంపుతో రియల్‌మి 16 ప్రో ఇప్పుడు రూ. 40వేల లోపు ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో నేరుగా పోటీ పడుతుంది. ధరల పెంపుకు సంబంధించి ఫస్ట్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మే 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
