Realme 16 Launch : వావ్.. రియల్‌మికి ఇంత క్రేజా.. భారీ 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ ఆగయా.. మీ బడ్జెట్ ధరలోనే..!
Realme 16 Launch : రియల్‌మి నుంచి అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్ వచ్చేసింది. భారీ 7000mAh బ్యాటరీతో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : April 2, 2026 / 02:55 PM IST
Realme 16 Launch
- రియల్‌మి 16 భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సన్నని డిజైన్ ఆకర్షణ
- స్మూత్ డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్
- బ్యాంక్ ఆఫర్లతో ధర సుమారు రూ. 28,999 నుంచి ప్రారంభం
- మంచి కెమెరాలు, పలు స్టోరేజ్ ఆప్షన్లు
Realme 16 Launch : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 16 ఫోన్ భారత మార్కెట్లో ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ లిస్టులో చేరింది. ఈ రియల్‌మి ఫోన్ కొత్త డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ అందిస్తుంది. ఈ రియల్‌మి 7,000mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ ఉన్నాయి. రియల్‌మి 16 ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రియల్‌మి 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి 16 ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సూర్యకాంతిలో ఈ స్మార్ట్‌ఫోన్ 4200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP69 సర్టిఫికేషన్ అందిస్తుంది.
ఇంటర్నల్ పార్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో SoC నుంచి పవర్ పొందుతుంది. 8-కోర్ సీపీయూతో వస్తుంది. ఇందులో 12GB వరకు ర్యామ్, 356GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. రియల్‌మి 16 ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ IMX 852 50MP రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ రియల్‌మి యూఐ 7.0తో వస్తుంది.
రియల్‌మి 16 ధర లభ్యత :
రియల్‌మి 16 ఫోన్ 8GB + 128GB మోడల్ ధర రూ. 31,999 కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ. 33,999గా ఉంది. ఈ ఫోన్ హై-ఎండ్ మోడల్ (12GB + 256GB) ధర రూ. 36,999గా ఉంది.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. ఈ డివైస్ కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఇ-స్టోర్, రిటైల్ స్టోర్‌లు, ఇతర ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంది.
