Realme C100x Phone : కొత్త రియల్‌మి ఫోన్ అదుర్స్.. 8,000mAh బ్యాటరీ 120Hz డిస్ప్లే కేక.. ధర జస్ట్ రూ. 15,000 లోపే..!
Realme C100x Phone : రియల్‌మి సి100ఎక్స్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్ప్లే 50MP ఏఐ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 14,499 కాగా జూలై 20న ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
Realme C100x Phone
- రియల్‌మి సి100ఎక్స్ 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు
- రూ. 14,499 ధరతో సింగిల్ 4GB + 64GB వేరియంట్
- ఫస్ట్ సేల్ జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం
Realme C100x Phone : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C100x ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. భారీ బ్యాటరీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నవారికి ఈ ఫోన్ బెస్ట్. భారీ 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే 50ఎంపీ ఏఐ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది.
రియల్‌మి సి100ఎక్స్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి సి100ఎక్స్ ఫోన్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 900 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే ఆర్మోర్‌షెల్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్లో ఆర్మ్ మాలి-జీ57 జీపీయూతో యూనిసోక్ టీ7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది.
ఇందులో 4జీబీ LPDDR4X ర్యామ్, 64జీబీ eMMC 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు. రియల్‌మి యూఐ 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ కోసం రియల్‌మి సి100ఎక్స్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50ఎంపీ ఏఐ రియర్ కెమెరా ఉంది.
Read Also : iPhone 16 Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. రూ.79,900 ఐఫోన్ 16 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో.. డీల్ మిస్ అవ్వకండి!
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్లో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 8,000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఫోన్ 17 గంటలకు పైగా నావిగేషన్ టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఐఎల్-ఎస్టీడీ-810H సర్టిఫికేషన్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. సేప్టీ పరంగా ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 5, బ్లూటూత్ 5.2, జీపీఎస్, GLONASS, Galileo, బీడీఎస్, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి.
భారత్‌లో రియల్‌మి సి100ఎక్స్ ధర :
భారత మార్కెట్లో రియల్‌మి సి100ఎక్స్ ఫోన్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో రూ. 14,499 ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ కోస్ట్, డీప్‌బ్లూ టైడ్స్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫస్ట్ సేల్ జూలై 20న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫోన్ రియల్‌మి అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
