Realme Narzo 100 Lite 5G : 7000mAh బ్యాటరీ, రియల్‌మి కొత్త నార్జో 100 లైట్ 5జీ వస్తోంది.. ఏప్రిల్ 14నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme Narzo 100 Lite 5G : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది. 7000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో రూ. 15వేల లోపు ధరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme Narzo 100 Lite 5G

  • ఈ రియల్‌మి ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌, మరెన్నో ఫీచర్లతో వస్తుంది
  • నార్జో 100 లైట్ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌
  • బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరాను అమర్చారు

Realme Narzo 100 Lite 5G : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్ తేదీ ఖరారైంది. వచ్చే వారం ప్రారంభంలో ఈ 5జీ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ రియల్‌మి ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇందులో 7000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ రియల్‌మి ఇంకా అనేక ఇతర ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్‌కు ముందే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ లాంచ్ తేదీ :
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ ఏప్రిల్ 14న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. రియల్‌మి అధికారిక సోషల్ మీడియా ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Best 5 SUV Cars : రూ. 20 లక్షల లోపు 5 బెస్ట్ SUV ఫ్యామిలీ కార్లు.. ఒక్కో కారు రేంజే వేరబ్బా.. ఎగబడి కొనేస్తున్నారు..!

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ధర :
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లీకుల ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 13వేల నుంచి రూ. 15వేల మధ్య ధరలో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా రియల్‌మీ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ 6.9-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ను అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 7000mAh టైటాన్ బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ 6 ఏళ్ల పాటు చెక్కుచెదరదు. ఈ ఫోన్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మి నార్జో 100 లైట్ 5G,మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 5300mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కంపెనీ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందించింది. ఈ ఫోన్ థండర్ బ్లాక్ ఫ్రాస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కూడా ఉంది.