Realme P4s 5G Sale : వావ్.. సూపర్ ఫోన్ బ్రో.. ఈ రియల్‌మి 5G చీప్ గురూ.. బ్యాంకు ఆఫర్లతో తగ్గింపు ధరకే..!

Realme P4s 5G : రియల్‌మి గత వారమే భారత మార్కెట్లో రియల్‌మి P4s 5G వచ్చేసింది. సెప్టెంబర్ 3 నుంచి అమ్మకానికి వచ్చింది. ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు.

Realme P4s 5G Sale

  • 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 6,500 నిట్స్ బ్రైట్‌నెస్‌
  • 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా
  • 8,000mAh బ్యాటరీ సెటప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Realme P4s 5G Sale : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? గత వారమే భారత మార్కెట్లో రియల్‌మి P4s 5జీ ఫోన్ లాంచ్ అయింది. అయితే, ఈ సెప్టెంబర్ 3 నుంచి ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీ ఉంది. రియల్‌మి P4s 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

రియల్‌మి P4s 5G ధర ఎంతంటే? :
రియల్‌మి P4s 5జీ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 3నే మొదలైంది. రియల్‌మి 5జీ ఫోన్ 8GB+128GB వేరియంట్‌ ధర రూ. 34,999, 8GB+256GB వేరియంట్‌ ధర రూ. 37,999, 12GB+256GB వేరియంట్‌ ధర రూ. 41,999గా కంపెనీ నిర్ణయించింది.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, కంపెనీ బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. కస్టమర్లు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

రియల్‌మి P4s 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P4s 5జీ ఫోన్ 1272×2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ 6,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. హైపర్‌విజన్+ ఏఐ చిప్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది.

Read Also : Mivi One 5G Launch : మివి వన్ 5G ఫస్ట్ ఫోన్ వస్తోంది.. ఇండియాలో లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే!

డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69, IP68, IP66 రేటింగ్‌లతో వస్తుంది. 7000mm² VC కూలింగ్ కూలింగ్ కోసం ఏఐ గేమింగ్ పార్టనర్‌ అందిస్తుంది. కొలతలు 16.26 సెం.మీ పొడవు, 7.76 సెం.మీ వెడల్పు, 0.86 సెం.మీ మందం, బరువు 208 గ్రాములు ఉంటుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
రియల్‌మి P4s 5జీలో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ రియల్‌మి ఫోన్‌లో 8,000mAh బ్యాటరీని అమర్చారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫేషియల్ రికగ్నిషన్ ఉన్నాయి.