Realme P4s Launch : మిడ్‌రేంజ్‌లో కొత్త బ్యాటరీ కింగ్? రియల్‌మి P4s 5జీ లాంచ్‌కు రెడీ.. కీలక ఫీచర్లు ఇవే!

Realme P4s Launch : రియల్‌మి P4s 5G ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. 8,000mAh బ్యాటరీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో శాంసంగ్ M14 డిస్‌ప్లే ఉంటుందని అంచనా. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

Realme P4s Launch

  • ఆగస్టు 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌
  • రియల్‌మి P4s 5జీ 8,000mAh బ్యాటరీ ఆప్షన్

Realme P4s Launch : రియల్‌మి కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. రియల్‌మి P4s 5G ఫోన్ లాంచ్ కానుంది. ఇంతకుముందు ఈ సిరీస్‌లో రియల్‌మి P4, రియల్‌మి P4 లైట్, రియల్‌మి P4x, రియల్‌మీ P4 ప్రో 5జీ ఫోన్లను ప్రవేశపెట్టింది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

రియల్‌మి P4s 5G ఫోన్ ఆగస్టు 26న భారత మార్కెట్లో లాంచ్ కానుందని రియల్‌మి ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ టీజర్ ప్రకారం.. గ్రీన్ బేజ్-బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. రియల్‌మి P4s 5G ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా త్వరలోనే అమ్మకానికి రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో శాంసంగ్ M14 డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 6,500 నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్ అందిస్తుంది. హెచ్‌డీఆర్10+ నెట్‌ఫ్లిక్స్ హెచ్‌డీఆర్ కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుందని రియల్‌మి పేర్కొంది.

Read Also : Oppo Reno 14 5G : వావ్.. ఆఫర్ అదిరింది బ్రో.. ఈ ఒప్పో 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ధర జస్ట్ ఎంతంటే?

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ చిప్‌సెట్‌ అమర్చారు. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్కుల కోసం స్పెషల్ హైపర్‌విజన్+ ఏఐ చిప్ కూడా ఉంది. రియల్‌మి P4s 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP డ్యూయల్ ఏఐ కెమెరా యూనిట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో లభిస్తుందని అంచనా.

రియల్‌మి P4s 5G ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 3 రోజుల వరకు రన్ అవుతుంది. రియల్‌మి P4 లైట్ 5G ఫోన్ ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 144 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 6.8-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. రియల్‌మి P4 లైట్ 5G, ర్యామ్‌ 14GB వరకు పెంచుకోవచ్చు.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హీటింగ్ కంట్రోల్ కోసం ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. రియల్‌మి P4 లైట్ 5G బ్యాక్ కెమెరా యూనిట్‌లో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్ అందిస్తుంది.