Redmi 13 5G First Sale : రెడ్‌మి 13 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Redmi 13 5G First Sale : రెడ్‌మి 13 5జీ గత వెర్షన్ల మాదిరిగానే అద్భుతమైన గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రింగ్ లైట్ కలిగి ఉంది.
- Sreehari A
- Published On : July 12, 2024 / 04:26 PM IST
Redmi 13 5G to go on its first sale today_ Everything ( Image Source : Google )
Redmi 13 5G First Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ-సబ్ బ్రాండ్ రెడ్‌మి ఇటీవలే లేటెస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ డివైజ్ రెడ్‌మి 13 5జీని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ అమెజాన్‌లో ఫస్ట్ సేల్ మొదలైంది. రెడ్‌మి 13 5జీ మోడల్ గత రెడ్‌మి 12 5జీకి ముఖ్యమైన అప్‌గ్రేడ్. ఆగస్టు 2023లో లాంచ్ కాగా.. రెడ్‌మి 13 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. రెడ్‌మి 12 5జీ ఎంఐయూఐ 14లో రన్ అవుతుంది. ఈ కొత్త రెడ్‌మి 13 5జీ కంపెనీ కొత్త హైపర్ఓఎస్‌తో వస్తుంది.
Read Also : Redmi Note 14 Pro Launch : రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
రెడ్‌మి 13 5జీ ధర లభ్యత :
అమెజాన్‌లో రెడ్‌మి 13 5జీ ఫోన్ కొనుగోలుదారులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ప్రామాణిక వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కానీ, కంపెనీ ఆఫర్లతో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. రెడ్‌మి 13 5జీ రెండు వేరియంట్లలో అందిస్తోంది.
వనిల్లా మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, ఇతర వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉంది. రెడ్‌మి 13 5జీ మొత్తం ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఆఫర్‌తో పాటు అమెజాన్ మరికొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.
రెడ్‌మి 13 5జీ కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి 13 5జీ గత వెర్షన్ల మాదిరిగానే అద్భుతమైన గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రింగ్ లైట్ కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ డిజైన్ రెడ్‌మి 12 5జీని పోలి ఉంటుంది. అయితే, రింగ్ లైట్ అనేది సరికొత్త ఫీచర్ అని చెప్పవచ్చు. రెడ్‌మి 13 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.79-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించే పంచ్-హోల్ నాచ్‌ని కూడా కలిగి ఉంది. పంచ్-హోల్ నాచ్ డిజైన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. రెడ్‌మి 13 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ చిప్‌తో ఆధారితమైనది. రెడ్‌మి 12 5జీలో ఉపయోగించిన అదే చిప్‌సెట్ కలిగి ఉంది. ఎంఐయూఐ 14లో పనిచేసినప్పటికీ, కొత్త మోడల్ షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్‌తో ప్రారంభమవుతుంది. మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,030mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి 13 5జీ ఫోన్ 2ఎంపీ సెన్సార్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలకు 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
