Redmi A7 4G Series : పండగ చేస్కోండి.. 6300mAh బ్యాటరీతో 2 కొత్త రెడ్‌మి ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్ ఎంతంటే?

Redmi A7 4G Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? రెడ్‌మి A7 ప్రో 4జీ, రెడ్‌మి A7 4జీ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. దేశంలో ఈ బ్రాండ్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ. 10,499 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Redmi A7 4G Series

  • రెడ్‌మి నుంచి రెండు సరికొత్త ఫోన్లు వచ్చేశాయ్
  • 6,300mAh బ్యాటరీతో రెడ్‌మి ఎ7 4జీ సిరీస్
  • ఈ రెడ్‌మి ఫోన్లు ప్రారంభ ధర రూ.10,499 మాత్రమే

Redmi A7 4G Series : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇది మీకోసమే. రెడ్‌మి A7 ప్రో 4జీ, రెడ్‌మి A7 4జీ ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రెడ్‌మి A7 ప్రో 5జీ లాంచ్ అయిన వారం రోజుల తర్వాత దేశంలో ఈ బ్రాండ్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో రెండు ఫోన్లు లాంచ్ చేసింది.

ఈ రెడ్‌మి మోడళ్లు యూనిసోక్ T7250 ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ అందిస్తాయి. రెడ్‌మి A7 ప్రో 4జీ, రెడ్‌మి A7 4జీ ఫోన్‌లలో 13MP రియర్ కెమెరా కూడా ఉంది.

భారత్‌లో రెడ్‌మి A7 ప్రో 4జీ, రెడ్‌మి A7 4జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ రెడ్‌మి A7 ప్రో 4జీ ధర రూ. 11,499గా నిర్ణయిస్తుంది. బ్లాక్ స్కై సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు, రెడ్‌మి A7 4జీ, 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499గా ఉంది.

బ్లాక్ స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఏప్రిల్ 23 నుంచి Mi.com, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా ఉన్న షావోమీ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి A7 ప్రో 4G, రెడ్‌మి A7 4జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి A7 ప్రో 4జీ ఫోన్ 6.9-అంగుళాల (720 x 1,600 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్‌ అందిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ 6.88-అంగుళాల (720 x 1,640 పిక్సెల్స్) ఎల్ సీడీ స్క్రీన్‌ అందిస్తుంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 8-బిట్ కలర్ డెప్త్‌ను అందిస్తాయి. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.

రెడ్‌మి A7 ప్రో 4జీ ఫోన్, రెడ్‌మి A7 4జీ రెండూ యూనిసోక్ T7250 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ప్రో మోడల్‌లో 4GB ర్యామ్ ఉండగా, బేసిక్ A7 4జీలో 3GB ర్యామ్ ఉంది. ఈ రెండు ఫోన్‌లలో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. స్పెషల్ మైక్రో SD స్లాట్ కూడా ఉంది.

Read Also : Tim Cook : ఆపిల్‌కు కొత్త సీఈఓ ఇతడే.. 15 ఏళ్ల తర్వాత టిమ్ కుక్ రాజీనామా.. జాన్ టెర్నస్ ఎవరంటే?

రెడ్‌మి A7 ప్రో 4జీ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. మరోవైపు, రెగ్యులర్ మోడల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2పై రన్ అవుతుంది. రెండు ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. రెడ్‌మి A7 ప్రో 4జీ ఫోన్ రెడ్‌మి A7 4జీ ఫోన్‌లలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు Wi-Fi 5, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తాయి. IP52 రేటింగ్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తాయి.

రెడ్‌మి A7 ప్రో 4జీ ఫోన్ కొలతలు 171.56×79.47×8.15mm బరువు 208 గ్రాములు. 6,300mAh బ్యాటరీతో వస్తుంది. రెడ్‌మి A7 4జీ ఫోన్ కొలతలు 171.79 x 79.77 x 8.26mm బరువు సుమారుగా 193 గ్రాములు ఉంటుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 15W వైర్డ్ ఛార్జింగ్ 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.